వ‌ర్మ మెగా ఫ్యామిలీని ఎందుకు టార్గెట్ చేశాడు?


 

allu aravind can excuse Ram gopal varma
allu aravind can excuse Ram gopal varma

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఒక‌ప్పుడు ఇండ‌స్ట్రీకి  `శివ‌` సినిమాతో తిరుగులేని హిట్‌ని అందించిన ద‌ర్శ‌కుడు. ఆ త‌రువాత అంఏ చెప్పుకోవ‌డానికి పెద్ద‌గా ఏ సినిమా లేదు. అయినా ఇన్నేళ్లుగా వ‌ర్మ ద‌ర్శ‌కుడిగా, నిర్మాత‌గా కొన‌సాగుతున్నారంటే దానికి ప్ర‌ధాన కార‌ణం వివాదాలు. అవి లేక‌పోతే తాను లేన‌ని గ్ర‌హించిన వ‌ర్మ త‌న ప‌ని అయిపోయింది అన్న ప్ర‌తీ సారి ఏదో ఒక వివాదాస్ప‌ద అంశాన్ని తీసుకుని సినిమా చేయ‌డం దాంతో కావాల్సి నంత ర‌చ్చ చేయ‌డం తెలిసిందే.

బాలీవుడ్‌లో వ‌ర్మతో సినిమాలు చేసేవారు లేక‌పోవ‌డంతో మ‌ళ్లీ టాలీవుడ్‌కు మకాం మార్చిన వ‌ర్మ ఇక్క‌డున్న వారినే టార్గెట్ చేస్తూ సినిమాలు తీయ‌డం, వివాదాలు సృష్టించ‌డం మొద‌లుపెట్టారు. అయినా వాటి ద్వారా పెద్ద‌గా వ‌సూళ్లు ద‌క్క‌పోవ‌డం రెండు మూడు రోజుల‌కు మించి త‌న సినిమాలు థియేట‌ర్ల‌లో క‌నిపించ‌క‌పోవ‌డంతో.. ఇంత‌లో క‌రోనా వైర‌స్ ప్ర‌బ‌ల‌డంతో సొంత‌ ఓటీటీ లో పోర్న్ సినిమాల‌కు శ్రీ‌కారం చుట్టాడు వ‌ర్మ‌. ఎవ‌రు త‌న‌తో సినిమా చేయ‌క‌పోయినా, త‌న‌ని విమ‌ర్శించిన‌ వాళ్ల‌ని టార్గెట్ చేయ‌డం వ‌ర్మ‌కు వెన్న‌తో పెట్టిన విద్య‌.

క‌రణ్ జోహార్ ని టార్గెట్ చేసి అత‌ని వ‌ల్లే బాలీవుడ్ వ‌దిలేసిన వ‌ర్మ గ‌త కొంత కాలంగా టాలీవుడ్ మీద ప‌డ్డారు. గ‌తంలో అశ్వ‌నీద‌త్ నిర్మాత‌గా మెగాస్టార్ హీరోగా వ‌ర్మ ఓ చిత్రాన్ని ప్లాన్ చేశారు.అది ఇద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌ల కార‌ణంగా రెండు పాట‌లు చిత్రీక‌రించిన త‌రువాత అర్థాంత‌రంగా ఆగిపోయింది. ఆ త‌రువాత వ‌ర్మ మ‌రోసారి చిరుతో `దొర‌` చేయాల‌నుకున్నారు. అదీ కుద‌ర‌లేదు. అప్ప‌టి నుంచి మెగాస్టార్‌పై మోగా ఫ్యామిలీపై క‌క్ష పెంచుకున్న వ‌ర్మ మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ వ‌స్తున్నారు. ఆ మ‌ధ్య శ్రీ‌రెడ్డితో ప‌వ‌న్‌ని తిట్టించి ర‌చ్చ చేసిన వ‌ర్మ ఇటీవ‌ల `ప‌వ‌ర్‌స్టార్‌` సినిమాతో త‌న నైజాన్ని చాటుకున్నారు.తాజాగా ఈసారి అల్లు ఫ్యామిలీని టార్గెట్ చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. ప‌వ‌న్ విష‌యంలో వ‌ర్మ తాట‌తీస్తాన‌ని బ‌హిరంగంగానే అల్లు అర‌వింద్ హెచ్చ‌రించిన విష‌యం తెలిసిందే. తాజాగా `అల్లు` వారినే టార్గెట్ చేస్తూ వ‌ర్మ చేయ‌బోతున్న సినిమా విష‌యంలో అల్లూ వారు ఎలా రియాక్ట్ అవుతారా అని స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది.