రెండో పెళ్లి చేసుకున్న అల్లు అరవింద్ కొడుకుAllu Bobby Second Marriage
Allu Bobby Second Marriage

అగ్ర నిర్మాత అల్లు అరవింద్ పెద్ద కొడుకు అల్లు బాబీ నిన్న రెండో పెళ్లి చేసుకున్నాడు . 11 ఏళ్ల క్రితమే అల్లు బాబీ కి పెళ్లి కాగా 10 సంవత్సరాల వయసున్న అమ్మాయి ఉంది . అయితే తాజాగా నీల షా అనే యువతిని రెండో పెళ్లి చేసుకున్నాడు . హైదరాబాద్ లోని కోహినూర్ హోటల్ లో ఈ వివాహం జరుగగా కొద్దిమంది సన్నిహితులను మాత్రమే ఈ వేడుకకు పిలిచారు . ఎందుకంటే ఇది రెండో పెళ్లి కాబట్టి .

అల్లు అరవింద్ కు ముగ్గురు కొడుకులు కాగా అల్లు బాబీ పెద్దవాడు . ఇక రెండో కొడుకు అల్లు అర్జున్ కాగా మూడో కొడుకు అల్లు శిరీష్ అన్న విషయం తెలిసిందే . అల్లు ఇంట మళ్ళీ పెళ్లి జరగడంతో మెగా కుటుంబం ఆ వేడుకలో పాల్గొంది . అల్లు బాబీ జనాలకు అంతగా తెలియదు కానీ ఇలా రెండో పెళ్లి చేసుకొని హాట్ టాపిక్ అయ్యాడు మీడియాలో .