అల్లు అర్జున్ అన్నయ్య సక్సెస్ అవుతాడా ?


Allu aravind elder son allu bobby turned as producer
Allu Bobby

అల్లు అరవింద్ కు ముగ్గురు కొడుకులు కాగా అందులో అల్లు అర్జున్ రెండో వాడు , అల్లు శిరీష్ మూడో వాడు . ఈ ఇద్దరూ చాలామంది కి తెలుసు కానీ అల్లు అరవింద్ పెద్ద కొడుకు అల్లు అర్జున్ అన్నయ్య బాబీ మాత్రం పెద్దగా ఎవరికీ తెలియదు కేవలం అల్లు అరవింద్ కుటుంబంతో పరిచయం ఉన్నవాళ్లకు మాత్రమే తెలుసు . అయితే మొదట అల్లు అర్జున్ ని హీరోగా పరిచయం చేసిన అల్లు అరవింద్  ఆతర్వాత అల్లు శిరీష్ ని కూడా వెండితెర మీదకు వదిలాడు.

అల్లు అర్జున్ స్టార్ హీరోగా ప్రేక్షకుల నీరాజనాలు అందుకుంటున్నాడు అయితే అల్లు శిరీష్ మాత్రం ఇంకా కష్టపడుతూనే ఉన్నాడు పాపం . అయితే పెద్ద కొడుకు ఇంకా ఇండస్ట్రీ కి పరిచయం కాలేదు కాబట్టి అతడ్ని నిర్మాతగా పరిచయం చేయడానికి అల్లు అరవింద్ సన్నాహాలు చేస్తున్నాడు . పెద్ద కొడుకు కూడా తనలాగే నిర్మాత అయి సక్సెస్ అయితే అదే పదివేలు అని ఆశపడుతున్నాడు అల్లు అరవింద్ . మరి అల్లు బాబీ నిర్మాతగా సక్సెస్ అవుతాడా ? లేదా ? అల్లు అరవింద్ అంతటి స్కిల్స్ ఉన్నాయా ? అన్నది త్వరలోనే తేలిపోనుంది ….. ఎందుకంటే నిర్మాతగా అడుగుపెడుతున్నాడు బాబీ .

English Title: Allu aravind elder son allu bobby turned as producer