అల్లు అరవింద్ కావాలనే సైరాకు దూరంగా ఉన్నారా?


allu aravind
allu aravind

సినిమా ఎలా ఉన్నా ఫైనల్ గా కలెక్షన్స్ మాత్రమే ఫలితాన్ని నిర్దేశిస్తాయి. సినిమా అందరికీ లాభాల్ని పంచితే హిట్ అన్నట్టు లేకపోతే బాల్చీ తన్నేసినట్టు. ఇంత సింపుల్ గా ఉన్న వ్యవహారాన్ని అందరం ఇది బాగుంది ఇది బాలేదు అంటూ డిబేట్ లు పెట్టుకుని కంప్లికేట్ చేసుకుంటాం. మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి పైనే ప్రస్తుతం ట్రేడ్ దృష్టాంతా ఉంది.

ఈ చిత్రానికి అదిరిపోయే రివ్యూలు వచ్చాయి. భాషతో సంబంధం లేకుండా క్రిటిక్స్ అందరూ ఈ చిత్రాన్ని పొగిడేశారు. అయితే కర్ణాటక, తెలుగు రాష్ట్రాలు తప్పితే మిగతా చోట్ల సైరా లాస్ వెంచర్ అయ్యేలా ఉంది. నిజానికి సైరా చిత్రానికి 300 కోట్ల దాకా పెట్టారు. సినిమా ఎలా ఉన్నా కానీ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే టెక్నీక్, ప్రమోషన్లు, సరైన సమయంలో విడుదల చేయడం వంటి అంశాలు ఫలితాన్ని నిర్దేశిస్తాయి.

ఇవేమీ వేరే భాషల్లో కుదరని సైరా ప్లాప్ వెంచర్ అయ్యేలా ఉంది. అయితే ఈ విషయం ముందే పసిగట్టిన అల్లు అరవింద్ కావాలనే సైరాకు దూరంగా ఉన్నారట. మొదటినుండి సీనియర్ హీరోలకు పాన్ ఇండియా సినిమాలు సెట్ అవ్వవనే భావనలో ఉన్న అల్లు అరవింద్, సైరా కథను 12 ఏళ్ల క్రితమే తీయడానికి ముందుకు రాలేదు. బాహుబలి ఇచ్చిన ధైర్యంతో చిరంజీవి ముందడుగు వేసినా కానీ ఈ ప్రాజెక్ట్ హిట్ అవుతుందనే నమ్మకం లేని అరవింద్ కావాలనే సైరాకు డిస్టెన్స్ మైంటైన్ చేసాడని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.