హమ్మయ్య ! బోయపాటి కి సినిమా వచ్చింది


Boyapati Srinu
Boyapati Srinu

హమ్మయ్య ! ఎట్టకేలకు మాస్ దర్శకులు బోయపాటి శ్రీనుకు సినిమా వచ్చింది అది కూడా అగ్ర నిర్మాత అల్లు అరవింద్ బ్యానర్ లో . రాంచరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన వినయ విధేయ రామ చిత్రం ఘోర పరాజయం పొందడంతో బోయపాటి శ్రీను సినిమాలన్నీ లైన్ లో లేకుండాపోయాయి . బాలయ్య తో సినిమా అనుకున్నప్పటికీ అది క్యాన్సిల్ అయ్యింది .

దాంతో ఈ దర్శకుడు గత ఏడు నెలలుగా ఖాళీగానే ఉంటున్నాడు . అయితే ఎట్టకేలకు బోయపాటి ప్లాప్ లతో సంబంధం లేకుండా మా బ్యానర్ లో త్వరలోనే సినిమా ఉండబోతోంది అంటూ ప్రకటించాడు అగ్ర నిర్మాత అల్లు అరవింద్ . అల్లు అర్జున్ హీరోగా నటించిన సరైనోడు చిత్రాన్ని నిర్మించింది అల్లు అరవింద్ అన్న విషయం తెలిసిందే . అల్లు అర్జున్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది సరైనోడు చిత్రం . అయితే మా బ్యానర్ లో బోయపాటి తో సినిమా అని ప్రకటించాడు కానీ హీరో ఎవరు అన్నది మాత్రం వెల్లడించలేదు అల్లు అరవింద్ .