మ‌హేష్‌, ఎన్టీఆర్‌ల‌తో మ‌ల్టీస్టార‌ర్ ప్లాన్ చేశారా?

మ‌హేష్‌, ఎన్టీఆర్‌ల‌తో మ‌ల్టీస్టార‌ర్ ప్లాన్ చేశారా?
మ‌హేష్‌, ఎన్టీఆర్‌ల‌తో మ‌ల్టీస్టార‌ర్ ప్లాన్ చేశారా?

మ‌హేష్‌, ఎన్టీఆర్‌ల‌తో మ‌ల్టీస్టార‌ర్ చిత్రం రాబోతోందంటూ గ‌త రెండు రోజులుగా ఫిల్మ్ స‌ర్కిల్స్‌లో ఓ వార్త జోరుగా వినిపిస్తోంది. తాజా ప‌రిస్థితుల నేప‌థ్యంలో స్టార్ హీరోలు త‌మ పంథా మార్చుకుంటున్నారు. దీంతో ఈ వార్త నిజ‌మ‌నే వాద‌న వినిపిస్తోంది. మ‌హేష్‌, ఎన్టీఆర్‌ల‌తో ఓ భారీ మ‌ల్టీస్టార‌ర్ చిత్రాన్ని తెర‌పైకి తీసుకురావాల‌ని మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ ప్లాన్ చేస్తున్న‌ట్టు చెబుతున్నారు.

ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్‌ల క‌ల‌యిక‌తో రాజ‌మౌళి `ఆర్ ఆర్ ఆర్‌` చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా కార‌ణంగానే అల్లు అర‌వింద్‌కు తాజా ఆలోచిన వ‌చ్చింద‌ని చెబుతున్నారు. పైగా చాలా కాలంగా మ‌హేష్‌తో సినిమా చేయాల‌ని అల్లు అర‌వింద్ ప్లాన్ చేస్తున్నారు. అది కార్య‌రూపం దాల్చ‌డం లేదు. మ‌హేష్‌, ఎన్టీఆర్‌తో మంచి స‌న్నిహిత్యం వున్నందున ఈ ఇద్ద‌రిని క‌లిపి ఓ భారీ మ‌ల్టీ స్టార‌ర్ చేయాల‌ని ఆయ‌న ప్లాన్ చేస్తున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఇట‌వల ఇద్ద‌రు హీరోల‌ని ఫోన్‌లో సంప్ర‌దించిన అల్లు అర‌వింద్ ఈ ఇద్ద‌రు హీరోల నుంచి ఓకే చెప్పించుకున్నార‌ని చెబుతున్నారు. వ‌చ్చే ఏడాదే ఈ చిత్రాన్ని ప‌ట్టాలెక్కించేందుకు అల్లు అర‌వింద్ ప‌క్కా ప్ర‌ణాళిక‌ని కూడా సిద్ధం చేశార‌న్న‌ది తాజా న్యూస్‌. ప్ర‌స్తుతం మ‌హేష్ `స‌ర్కారు వారి పాట‌` చిత్రం చేస్తున్నారు. ఎన్టీఆర్ `ఆర్ ఆర్ ఆర్‌`లో న‌టిస్తున్నారు. దీని త‌రువాత త్రివిక్ర‌మ్ సినిమా చేయాల్సి వుంది.