మెగా నిర్మాత కోరిక మామూలుగా లేదుగా?


మెగా నిర్మాత కోరిక మామూలుగా లేదుగా?
మెగా నిర్మాత కోరిక మామూలుగా లేదుగా?

మెగా నిర్మాత అల్లు అరవింద్ ఏ సినిమా చేసినా ఎంతో క్యాలిక్యులేషన్స్ తో చేస్తారు. అలాగే ఏం మాట్లాడినా ఆ క్యాలిక్యులేషన్ని మాత్రం మర్చిపోరు. అలాంటి మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు సర్వత్రా చర్చనీయాంశంగా మారుతున్నాయి. తాజాటా సాయిధరమ్ తేజ్, రాశిఖన్నా జంటగా నటించిన `ప్రతిరోజూ పండగే` విజయంతో మాంచి జోష్ మీదున్న ఆయన చిరంజీవిపై కామెంట్ చేయడం టాలీవుడ్ లో సంచలనంగా మారింది.

చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన సమయంలో అండగా నిలిచిన వార్తల్లో కెక్కిన అల్లు అరవింద్ తాజాగా చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. చిరు కెరీర్ కు బలమైన పిల్లర్ గా నిలిచిన అల్లు అరవింద్ ఆయనని భారత రాష్ట్ర పతిగా చూడాలన్నది తన డ్రీమ్ అని షాకిచ్చారు. చిరంజీవి ఏంటి భారత రాష్ట్రపతి ఏంటని అది అయ్యే పనేనా అని అంతా అవాక్కవుతున్నారు.

రాష్ట్రపతి అంటే మామూలు విషయం కాదు. రాజకీయంగా పండిపోయిన వారిని మాత్రమే పదవి వరిస్తూ వుంటుంది. ఎమ్మెల్యేగా, ఎంపీగా సేవలందించిన చిరంజీవి భారత రాష్ట్రపతి కావడం అన్నది అంత ఆషామాషీ వ్యవహారం కాదని పలువురు సినీ ప్రముఖులు చెబుతున్నారు. అయితే రాష్ట్ర పతి రేసులో గత కొంత కాలంగా బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ పేరుని వినిపించారు. నటుడు శత్రఘ్న సిన్హా ఓ టీవీ షోలో భారత రాష్ట్ర పతిగా వుండాల్సిన వ్యక్తి అమితాబ్ అని, బాహాలంగానే వెల్లడించారు. అదే స్థాయిలో సౌత్ నుంచి చిరంజీవి పేరుని అల్లు అరవింద్ తీసి వుంటారని, అయితే అది అంత ఈజీ కాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

చిరంజీవి, అల్లు అరవింద్, భారత రాష్ట్రపతి, chiranjeevi, allu aravind,  president of india,
allu aravind sensational comments on chiranheevi