ఆ కాళ్ల ద‌గ్గ‌ర సేద‌తీరుతున్న కుటుంబం మాది!


ఆ కాళ్ల ద‌గ్గ‌ర సేద‌తీరుతున్న కుటుంబం మాది!
ఆ కాళ్ల ద‌గ్గ‌ర సేద‌తీరుతున్న కుటుంబం మాది!

`అల్లు అర్జున్ న‌టించిన చిత్రం `అల వైకుంఠ‌పుర‌ములో`, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ తెర‌కెక్కించిన ఈ చిత్రం ఈ ఆదివారం విడుద‌లై మంచి టాక్‌ని సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే. ప్రీమియ‌ర్ షోల‌తో స‌రికొత్త రికార్డును సృష్టించిన ఈ చిత్రం రానున్న రోజుల్లో మ‌రిన్ని వ‌సూళ్ల‌ని సాధించి బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌నం సృష్టించే అవ‌కాశం వుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఈ సంద‌ర్భంగా చిత్ర బృందం సోమ‌వారం థ్యాక్స్ మీట్‌ని హైద‌రాబాద్‌లో నిర్వ‌హించింది. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న నిర్మాత అల్లు అర‌వింద్ ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని మీడియాతో పంచుకున్నారు.

ఆయ‌న మాట్లాడుతూ `మేమంతా ఇద్ద‌రికి కృత‌జ్ఞ‌త‌లు చెప్పుకోవాలి, తెలుగు క‌ళామ‌త‌ల్లికి రూపం ఇస్తే ఆ క‌ళ్ల ద‌గ్గ‌ర సేద‌తీరుతున్న కుటుంబ మాది. మ‌మ్మ‌ల్ని త‌ర‌త‌రాలుగా అభిమానిస్తూ, ఆశీర్వ‌దిస్తున్న ప్ర‌క్ష‌క మ‌హానుభావుల‌కు నా న‌మ‌స్కారం. త్రివిక్ర‌మ్ చాలా చిన్న‌క‌థని అద్భుతంగా తెర‌పై ఆవిష్క‌రించారు. తొలుత త‌మ‌కు క‌థ చెప్పిన‌ప్పుడు ఫ‌స్ట్ హాఫ్ పూర్తి కాగానే చించేశారని చెప్పాను. స్క్రీన్ రైటింగ్ తెలిసిన వాడే చిన్న క‌థ‌నైనా ఇంత బాగా రాయ‌గ‌ల‌డ‌ని చెప్ప‌గ‌ల‌డ‌ని త్రివిక్ర‌మ్ నిరూపించారు. `అల వైకుంఠ‌పుర‌ములో` మ‌హ‌త్త‌ర‌మైన క‌థేమీ కాదు కానీ త‌ల్లిదండ్రుల ద‌గ్గ‌రి నుంచి విడిపోయిన ఇద్ద‌రు కొడుకుల క‌థ‌ని చాలా చ‌క్క‌గా తెర‌పైన చూపించారని చెప్పుకొచ్చారు.

ఇలాంటి క‌థ‌ని అల‌వోక‌గా చేస్తే టెన్ష‌న్‌తో వెన‌కాల చూస్తున్న వాళ్ల న‌రాలు తెగిపోతాయి. అయినా చాలా డిఫ‌రెంట్‌గా కొత్త పంథాలో త‌న పాత్ర‌ని అల్లు అర్జున్ ర‌క్తిక‌ట్టించాడు. అలా చేయ‌డం వెన‌క ఎంతో త‌ప‌న వుంది. ఆ త‌ప‌న వ‌ల్లే త‌న పాత్ర‌ని చాలా ఈజ్‌తో అల్లు అర్జున్ చేయ‌గ‌లిగాడు అని వెల్లడించ‌డం ఆస‌క్తికరంగా మారింది.