టాక్సీ వాలా పరిస్థితి ఏంటి


Allu aravind unhappy with taxiwala output

విజయ్ దేవరకొండ హీరోగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం టాక్సీ వాలా . మాళవిక నాయర్ కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ గీతా ఆర్ట్స్ 2 సంయుక్తంగా నిర్మించింది. అయితే ఈ చిత్రాన్ని ఎప్పుడో విడుదల చేయాల్సి వుండే కానీ వాయిదా వేస్తున్నారు గత కొంతకాలంగా . ఈ టాక్సీ వాలా ని వాయిదా వేయడానికి కారణం ఏంటో తెలుసా…….. ఔట్ పుట్ అల్లు అరవింద్ కు నచ్చకపోవడమే ! టాక్సీ వాలా విడుదలకు సిద్దంగా ఉన్న నేపథ్యంలో అల్లు అరవింద్ కు ఒకసారి చూపించారట , సినిమా మొత్తం చూసిన అల్లు అరవింద్ కు చాలా సన్నివేశాలు నచ్చలేదట దాంతో టాక్సీ వాలా కు రిపేర్లు చేయాలని భావించి తగిన సలహాలు సూచనలు ఇచ్చాడట అల్లు అరవింద్.

దాంతో టాక్సీ వాలా ని పక్కనపెట్టి గీత గోవిందం ని ముందుగా విడుదల చేస్తున్నారు. గీత గోవిందం చిత్రం లో కూడా విజయ్ దేవరకొండ హీరో కాగా గీతా ఆర్ట్స్ 2 సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఆగస్టు 15న గీత గోవిందం విడుదల అవుతుండగా టాక్సీ వాలా ఎప్పుడు విడుదల అవుతుందో మాత్రం తెలియడం లేదు. విజయ్ దేవరకొండ కు మంచి ఇమేజ్ ఏర్పడింది దాంతో దాన్ని మరింతగా క్యాష్ చేసుకోవాలంటే తప్పకుండా టాక్సీ వాలా కు రిపేర్లు చేయాలని డిసైడ్ అయ్యారట అల్లు అరవింద్ ఆదేశంతో.

English Title: allu aravind unhappy with taxiwala output