మ‌ద‌న్‌మోహ‌న్ మాల‌వ్య‌గా అల్లు అర్హ‌!మ‌ద‌న్‌మోహ‌న్ మాల‌వ్య‌గా అల్లు అర్హ‌!
మ‌ద‌న్‌మోహ‌న్ మాల‌వ్య‌గా అల్లు అర్హ‌!

సోష‌ల్ మీడియాలో సెల‌బ్రిటీలే కాదు వారి పిల్ల‌లు కూడా హంగామా సృష్టిస్తున్న విష‌యం తెలిసిందే. ప్ర‌తీ విష‌యాన్ని ఈ మ‌ధ్య స్టార్ హీరోలు, వారి పిల్ల‌లు సోష‌ల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్‌గా మారుతున్నాతున్నాయి. తాజాగా అలాంటి ఓ వీడియో వైర‌ల్‌గా మారింది.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముద్దుల కుమార్తె అల్లు అర్హ గ‌త కొంత కాలంగా సోష‌ల్ మీడియాలో హాట్ ఫేవ‌రేట్‌గా నిలుస్తున్న విష‌యం తెలిసిందే. తాజాగా  అర్హ‌కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు వైర‌ల్‌గా మారింది. స్వాతంత్య్రదినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని ప్ర‌ముఖ స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు మ‌ధ‌న్‌మోహ‌న్ మాల‌వ్య గెట‌ప్‌లో ద‌ర్శ‌నిమిచ్చింది.

ఈ గెట‌ప్‌కు సంబంధించిన ఫొటోతో పాటు ఓ వీడియోను అల్లు అర్జున్ వైఫ్ స్నేహారెడ్డి సోష‌ల్ మీడియా ఇన్‌స్టా వేదిక‌గా షేర్ చేసింది. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఇదిలా వుంటే అల్లు అర్జున్ ప్ర‌స్తుతం `పుష్ప‌` చిత్రంతో పాటు కొర‌టాల శివ రూపొందించ‌నున్న చిత్రంలోనూ న‌టించ‌నున్న విష‌యం తెలిసిందే.