గంగోత్రి నుంచి వైకుంఠపురానికి అర్జునుడు – @ 17 ఏళ్ళ సినీ ప్రస్థానం

గంగోత్రి నుంచి వైకుంఠపురానికి అర్జునుడు - @ 17 ఏళ్ళ సినీ ప్రస్థానం
గంగోత్రి నుంచి వైకుంఠపురానికి అర్జునుడు – @ 17 ఏళ్ళ సినీ ప్రస్థానం

సౌత్ ఇండియా లో డాన్స్ మరియు ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ ను కమర్షియల్ హీరోయిజానికి  జోడించిన వ్యక్తి లెజెండ్ చిరంజీవి గారు అయితే…  సిక్స్ ప్యాక్ ట్రెండ్ ను టాలీవుడ్ కి తీసుకు వచ్చి పరిచయం చేసిన ఘనత అల్లుఅర్జున్ దక్కుతుంది.

గొప్ప పేరున్న కుటుంబంలో పుట్టడమే కాకుండా.. ఆ కుటుంబానికి ఇంకా గొప్ప పేరు తీసుకు వచ్చిన ఒక గొప్ప కళాకారుడు అల్లు అర్జున్.  నట శిఖరం లాంటి అల్లు రామలింగయ్య గారు; సినిమా రంగానికి కళారంగానికి ఎంతోమంది ప్రతిభావంతులను పరిచయం చేసిన నిర్మాత అల్లు అరవింద్ గారు వేసిన బాటలో ముందుకు పయనిస్తూ… చేసే ప్రతి సినిమాకి తను ఎదుగుతూ.. అభిమానులకు కూడా ఆదర్శంగా నిలుస్తున్న అల్లు అర్జున్ గారు నేటితో 17 సంవత్సరాల సినీ ప్రయాణం పూర్తి చేసుకున్నారు. మొదట చిరంజీవి గారు నటించిన “విజేత” సినిమాలోని బాలనటుడిగా ఆ తర్వాత “డాడీ” సినిమాలో ఒక ప్రత్యేక పాత్రలో నటించిన అల్లు అర్జున్ గారు గంగోత్రి సినిమా తో పూర్తిస్థాయి నటుడిగా వెండి తెరకు పరిచయం అయ్యారు. ఈ సినిమా ఘన విజయం సాధించడంతో పాటు అల్లు అర్జున్ కు మంచి పేరు తీసుకువచ్చింది. మొదటి సినిమాలోనే ఆడ వేషం వేసి, తను కేవలం కమర్షియల్ హీరో మాత్రమే కాదని తన ఒక పరిపూర్ణమైన నటుడినని నిరూపించే ప్రయత్నం చేశారు అల్లు అర్జున్

హీరోల ఇమేజ్ ను అద్భుతంగా హీరోల చూపించే దర్శకుడు వి.వి.వినాయక్ గారి దర్శకత్వంలో “బన్నీ” అనే సినిమా చేశారు.  రెండు అప్పటి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ప్రస్తావించబడని సమస్య అయిన పోలవరం ప్రాజెక్టు యొక్క ప్రస్తావన ఆ సినిమాలో ఉంటుంది.  తర్వాత సుకుమార్ గారి దర్శకత్వంలో “ఆర్య” అనే సినిమాలో విభిన్నమైన భావజాలం ఉన్న ప్రేమికుడిగా ప్రేక్షకుల మనసును దోచుకున్నారు అల్లు అర్జున్. ఇక అదే కోవలో ప్రేమకథా చిత్రాల స్పెషలిస్ట్ అయిన కరుణాకరన్ దర్శకత్వంలో “హ్యాపీ” అనే సినిమా చేశారు. ఆ సినిమా కమర్షియల్ గా విజయం సాధించలేదు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఆ తర్వాత వచ్చిన “దేశముదురు” సినిమా అల్లు అర్జున్ లోని నటనను, హీరోయిజాన్ని పూర్తిస్థాయిలో ప్రేక్షకులకు పరిచయం చేసింది.

తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ గారి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాతో ఆయన ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు కూడా అందుకున్నారు. తర్వాత సుకుమార్ గారి దర్శకత్వంలో “ఆర్య” సినిమాకు సీక్వెల్ గా వచ్చిన “ఆర్య 2” సినిమా లో హీరోయిజం ఛాయలున్న ఒక విలన్ గా…  విలన్ ఛాయలున్న ఒక హీరోగా అలా కాంప్లికేటెడ్ క్యారెక్టర్ ను అద్భుతంగా పోషించారు అల్లు అర్జున్.

ఇప్పుడు ఒక రకంగా హీరోయిజానికి నెగిటివ్ షేడ్స్ అద్ది “కల్ట్ సినిమాలు” అనే పేరుతో ప్రజెంట్ చేస్తున్న  ట్రెండ్ ని ఆయన అప్పట్లోనే ఫాలో అయ్యారు. గుణశేఖర్ గారి దర్శకత్వంలో చేసిన “వరుడు” సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైన విజయం సాధించకపోయినా “వేదం” సినిమాలో కేబుల్ రాజు పాత్రలో ఆయన నటన విమర్శకులను, ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

మళ్లీ అల్లు అర్జున్ గారు వి.వి.వినాయక్ దర్శకత్వంలో చేసిన “బద్రీనాథ్” సినిమా కూడా కమర్షియల్ గా విజయం సాధించలేదు. తర్వాత మాటల మాంత్రికుడు సెల్యూలాయిడ్ తాంత్రికుడు అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన “జులాయి” సినిమా అల్లు అర్జున్ లోని హీరోను మరియు నటుడిని ఇద్దరినీ సమాంతరంగా ప్రేక్షకులకు చూపిస్తూ అద్భుతమైన సందేశాన్ని అందించింది. అదేవిధంగా ఘన విజయం సాధించింది.

ఆ తర్వాత వచ్చిన ఇద్దరమ్మాయిలతో మరియు రేసుగుర్రం సినిమాలలో లలో అల్లు అర్జున్ స్టైల్, డ్యాన్స్,కామెడీ టైమింగ్ ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. సామాజిక నేపథ్యంలో అల్లు అర్జున్ గారు “అయామ్ దట్ చేంజ్” షార్ట్ ఫిలిం కూడా రూపొందించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి దర్శకత్వంలో మళ్లీ అల్లు అర్జున్ నటించిన “సన్నాఫ్ సత్యమూర్తి” సినిమా కూడా ఘనవిజయం సాధించింది. ఇక అనుష్క ప్రధాన పాత్రలో రుద్రమదేవి సినిమాలో గోన గన్నారెడ్డి గా అల్లు అర్జున్ నటన కూడా అద్భుతంగా ఉంది.

 మాస్ దర్శకుడు బోయపాటి శీను కాంబినేషన్ లో ఆయన తెరకెక్కించిన “సరైనోడు” సినిమా కూడా సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన “దువ్వాడ జగన్నాథం” సినిమా కూడా విజయం సాధించింది.తర్వాత ఇండియన్ ఆర్మీ సోల్జర్ పాత్రలో ఆయన కనిపించిన “నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా” సినిమా కమర్షియల్ గా విజయం సాధించలేదు. కొంచెం గ్యాప్ తీసుకొని మళ్ళీ గురించి త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మీ ఆయన చేసిన “అల వైకుంఠ పురంలో” సినిమా ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ సాధించింది.

అల్లు అర్జున్ గారు ఇలాగే మరిన్ని మంచి సినిమాలు చేసి పాన్ ఇండియా స్టార్ అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం.