వ‌స్తుండా రెడీగా వుండండ‌బ్బా!


వ‌స్తుండా రెడీగా వుండండ‌బ్బా!
వ‌స్తుండా రెడీగా వుండండ‌బ్బా!

అల్లు అర్జున్ – సుకుమార్ క‌ల‌యిక‌లో ఓ భారీ చిత్రం వ‌స్తున్న విష‌యం తెలిసిందే.  మైత్రీ మూవీమేక‌ర్స్ ఈ చిత్రాన్ని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌. కీల‌క పాత్ర‌లో విల‌న్‌గా త‌మిళ న‌టుడు విజ‌య్ సేతుప‌తి న‌టిస్తున్నాడు. ప్రారంభం నుంచే ఈ చిత్రం వార్త‌ల్లో నిలుస్తోంది. కార‌ణం గత చిత్రాల‌కు పూర్తి భిన్నంగా అల్లు అర్జున్ ఈ చిత్రంలో లారీ డ్రైవ‌ర్‌గా మాసీవ్ పాత్ర‌లో క‌నిపించ‌బోతుండ‌ట‌మే.

ఈ నెల 8న అల్లు అర్జున్ బ‌ర్త్ డే. ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని చిత్ర బృందం ఫ‌స్ట్‌లుక్ టైటిల్‌ని రిలీజ్ చేయ‌బోతోంది. సుకుమార్ – బ‌న్నీ కాంబినేష‌న్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు రెండు చిత్రాలొచ్చాయి. ఆర్య‌, ఆర్య 2. ఆర్య సెన్సేష‌న‌ల్ హిట్‌గా నిలిస్తే ఆర్య 2 యావ‌రేజ్‌గా నిలిచింది. ముచ్చ‌ట‌గా మూడ‌వ‌సారి క‌లిసి ఈ కాంబినేష‌న్ సినిమా చేస్తోంది. దీంతో ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. దానికి ఏ మాత్రం తీసిపోని స్థాయిలో ఈ చిత్ర ఫ‌స్ట్ రిలీజ్ కోసం టీమ్ రిలీజ్ చేసిన అనౌన్స్‌మెంట్ పోస్ట‌ర్ వుంది.

అల్లు అర్జున్ న‌టిస్తున్న 20వ చిత్ర‌మిది. దీని అప్‌డేట్ కోసం ఫ్యాన్స్ చాలా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.  వారితో పాటు ప్రేక్ష‌కులకు ఫ‌స్ట్‌లుక్‌తో స‌ర్‌ప్రైజ్ ఇవ్వ‌బోతున్నారు. ఇందుకు ఫ‌స్ట్ లుక్ అనౌన్స్‌మెంట్ పోస్ట‌ర్‌లో బ‌న్నీ ప‌లికే చిత్తూరు భాష‌ని తెలివిగా వాడారు.  `ఏమ‌బ్బా అంద‌రూ బాగుండారా… మీరు ఎప్పుడెప్పుడా అని చూస్తుండే #AA20 అప్‌డేట్ ఏప్రిల్ 8న‌, తెల్లార్తో 9 గంట‌ల‌కి వ‌స్తాండాది.. రెడీ కాండ‌బ్బా.. అని పోస్ట‌ర్‌లో చెప్పేశారు. దీంతో ఫ్యాన్స్ పండ‌గ చేసుకుంటున్నారు. సోష‌ల్ మీడియాలో అప్పుడే హంగామా మొద‌లైంది. బ‌న్నీ పుట్టిన రోజున ఈ హంగామా ఏ స్థాయిలో వుంటుందో..

Credit: Twitter