బ‌న్నీ ఊర‌మాస్ లుక్ అద‌రిపోయిందే!


బ‌న్నీ ఊర‌మాస్ లుక్ అద‌రిపోయిందే!
బ‌న్నీ ఊర‌మాస్ లుక్ అద‌రిపోయిందే!

అల్లు అర్జున్ హీరోగా న‌టించిన చిత్రం `అల వైకుంఠ‌పుర‌ములో`. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ తెర‌కెక్కించిన ఈ చిత్రం ఇటీవ‌ల సంక్రాంతికి విడుద‌లై సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించింది. హారిక అండ్ హాసిని, గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్స్‌పై అత్యంత భారీగా ఎస్‌. రాధాకృష్ణ‌, అల్లు అర‌వింద్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం బ‌న్నీ కెరీర్‌లోనే తొలి ఇండ‌స్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా త‌రువాత  కొంత విరామం తీసుకున్నారు బ‌న్నీ.

సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర్జున్ ఓ మాస్ మ‌సాలా ఎంట‌ర్‌టైన‌ర్ చేయ‌బోతున్న విష‌యం తెలిపిందే. `రంగ‌స్థ‌లం` త‌ర‌హాలో ఊర‌మాస్ గా ఈ సినిమా వుండ‌బోతోందిని తెలుస్తోంది. ఈ చిత్రంలో బ‌న్నీ లారీ డ్రైవ‌ర్‌గా క‌నిపించ‌బోతున్నారు. ఆయ‌న క్యారెక్ట‌ర్ మాస్‌గా వుంటుంద‌ని, అత్యంత స‌హ‌జ‌త్వంతో  చిట్టిబాబు త‌ర‌హాలో వుంటుంద‌ని తెలిసింది.

ఇందు కోసం గ‌త కొన్ని రోజులుగా బ‌న్నీ గ‌డ్డం, మీసం పెంచుతున్నారు. క్యారెక్ట‌ర్ కోసం చిత్తూరు భాష‌ని నేర్చుకుంటున్నారు. కొత్త‌గా ఓ ట్యూట‌ర్‌ని పెట్టుకుని మ‌రీ చిత్తూరు భాష‌పై ఇప్ప‌టికే ప‌ట్టుని సాధించార‌ట‌. త్వ‌ర‌లో న‌ల్ల‌మ‌ల అడ‌వుల్లో ఈ చిత్ర కీల‌క షెడ్యూల్‌ని చేయ‌బోతున్నారు. లాక్ డౌన్ త‌రువాత ఈ షెడ్యూల్ ఉండే అవ‌కాశం వుంది. ఇదిలా వుంటే సుక్కు సినిమాలో బ‌న్నీ లుక్ ఇదే అంటూ ఫ్యాన్ మేడ్ పోస్టర్ ఒక‌టి సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

గుబురు గ‌డ్డం, మెలితిరిగిన మీసంతో బ‌న్నీ కొత్త‌గా మాసీవ్ లుక్‌లో క‌నిపిస్తున్నాడు. ఇదే నిజ‌మైన లుక్ ఏమో అంటూ నెటిజ‌న్స్ కామెంట్ చేస్తున్నారు. ఫ్యాన్‌మేడ్ లుక్ రియ‌లైతే బ‌న్నీ ఫ్యాన్స్‌కి పండ‌గే.