అల్లు అర్జున్ రాశి ఖన్నాని ఒకే చేస్తాడా?


allu arjun rashi khanna
Allu Arjun and Rashi Khanna

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించబోయేఐకాన్చిత్రంలో హీరోయిన్ గా చాలా పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. అందులో ప్రముకంగా రాశి ఖన్నా పేరు ఎక్కువగా పివినిపిస్తోంది. ఫైనల్ గా రాశినే కన్ఫర్మ్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఇంకా చిత్ర యూనిట్ అఫీషియల్ గా ఎనౌన్స్ చేయలేదు. మరి బన్నీ రాశి ఖన్నాని ఒకే చేస్తాడా? లేదా!? అన్నది తెలియాల్సి వుంది

ఆర్య, పరుగు, డీజే (దువ్వాడ జగన్నాధం) చిత్రాల తరువాత శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో అల్లు అర్జున్ తో దిల్ రాజు నిర్మిస్తోన్న నాల్గవ చిత్రం ఇది. ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. నటీ నటుల ఎంపిక జరుగుతున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోoది. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఆగస్టు నుండి జరగనుంది!!