అఫీషియ‌ల్ : అల్లు అర్జున్ తో కొర‌టాల సినిమా ఫిక్స్‌!


అఫీషియ‌ల్ : అల్లు అర్జున్ తో కొర‌టాల సినిమా ఫిక్స్‌!
అఫీషియ‌ల్ : అల్లు అర్జున్ తో కొర‌టాల సినిమా ఫిక్స్‌!

శుక్ర‌వారం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త‌న 21వ చిత్రాన్ని అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా ఓ ఆస‌క్తిక‌ర‌మైన పోస్ట‌ర్ ని షేర్ చేసిన బ‌న్నీ దానితో పాటు ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. గ‌త రెండు మూడు రోజులుగా అల్లు అర్జున్‌, కొర‌టాల క‌ల‌యిక‌లో ఓ భారీ చిత్రం రాబోతోందంటూ వార్త‌లు షికారు చేస్తున్న విష‌యం తెలిసిందే. ఆ వార్త‌ల్ని నిజం చేస్తూ హీరో అల్లు అర్జున్ ట్విట్ట‌ర్ ద్వారా త‌న కొత్త ప్రాజెక్ట్‌ని ప్ర‌క‌టించారు.

`నా తదుపరి చిత్రం # AA21 ను కొరటాల శివ గారితో ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది. కొంత కాలంగా నిశ్శబ్దంగా దీని కోసం ఎదురు చూస్తున్నారు. సుడాధాకర్ గారు తన తొలి వెంచర్ కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నాను.  శాండీ, స్వాతి & నట్టి ఇది మీ పట్ల నాకున్న ప్రేమకు నిద‌ర్శ‌నం` అని ఓ ఆస‌క్తిర‌మైన పోస్ట‌ర్‌ని షేర్ చేశారు. యువ‌త రాజ‌కీయాల్లోకి రావాల‌నే కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని ద‌ర్శ‌కుడు కొన‌టాల శివ తెర‌కెక్కించ‌బోతున్నారు. ఈ చిత్రం ద్వారా సుధాక‌ర్ మిక్కిలినేని నిర్మాత‌గా, శాండీ, స్వాతి, న‌ట్టి స‌హ‌నిర్మాతలుగా ప‌రిచ‌యం కాబోతున్నారు.

వ‌సుధ ఆర్ట్స్‌తో క‌లిసి ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చ‌ర్స్ నిర్మించ‌నుంది. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌లో అల్లు అర్జున్ మ‌రో వ్య‌క్తితో వుండ‌గా గ్రామీణ నేప‌థ్యాన్ని త‌ల‌పించే విధంగా లాంత‌ర్‌, బోటు క‌నిపిస్తున్నాయి. పిరియాడిక్ డ్రామాగా తెర‌పైకి రానున్న ఈ చిత్రాన్ని వ‌చ్చే ఏడాది ప్రారంభం కానున్న ఈ చిత్రాన్ని 2022 ప్ర‌ధ‌మార్థంలో రిలీజ్ చేయ‌నున్నామ‌ని చిత్ర బృందం అప్పుడే ప్ర‌క‌టించేసింది.