అల్లు అర్జున్ – త్రివిక్రమ్ ల సినిమా సంక్రాంతి కి


అల్లు అర్జున్త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో ఇటీవలే కొత్త సినిమా ప్రారంభమైన విషయం తెలిసిందే . కాగా ఆ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . సంక్రాంతి పెద్ద పండగ అలాగే ఎక్కువ రోజులు సెలవులు ఉంటాయి కాబట్టి పెద్ద మొత్తంలో వసూళ్లు వస్తాయని భావించిన త్రివిక్రమ్ 2020 జనవరిలో సంక్రాంతి కానుకగా తమ సినిమాని విడుదల చేయాలనే ఆలోచన చేస్తున్నారు .

అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే నటిస్తుండగా కీలక పాత్రలో హాట్ భామ టబు కూడా నటిస్తోంది . సెంటిమెంట్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం అల్లు అర్జున్ – త్రివిక్రమ్ ల కాంబినేషన్ కు మూడోది . ఇంతకుముందు జులాయి , సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలు రాగా ఆ రెండు కూడా మంచి హిట్ అయ్యాయి దాంతో ఈ హ్యాట్రిక్ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి .