సిస్టర్ సెంటిమెంట్ కథతో అల్లు అర్జున్


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో మరోసారి నటించడానికి రెడీ అవుతున్న విషయం తెలిసిందే . ఇప్పటికే ఈ ఇద్దరి కాంబినేషన్ లో రెండు చిత్రాలు జులాయి , సన్నాఫ్ సత్యమూర్తి రాగా రెండు కూడా మంచి హిట్స్ అయ్యాయి దాంతో ఈ మూడో చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి . ఆ అంచనాలకు తగ్గట్లుగా ఈ మూడో చిత్రాన్ని సిస్టర్ సెంటిమెంట్ గా మలిచాడట దర్శకులు త్రివిక్రమ్ .

తెలుగునాట సిస్టర్ సెంటిమెంట్ చిత్రాలకు ఆదరణ బ్రహ్మాండంగా లభించిన విషయం తెలిసిందే . దాంతో సిస్టర్ సెంటిమెంట్ కు పెద్ద పీట వేస్తూ కథ , కథనం అల్లుకున్నాడట త్రివిక్రమ్ . సిస్టర్ సెంటిమెంట్ తో అల్లు అర్జున్ క్యారెక్టర్ మరింతగా ఎలివేట్ అవుతుందని భావిస్తున్నారు త్రివిక్రమ్ . అల్లు అర్జున్ ఈ చిత్రంలో సరికొత్తగా కనిపించనున్నాడట స్టైల్ పరంగా . ఇక ఈ చిత్రంలో హాట్ భామ టబు కూడా నటిస్తోంది . అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే నటించనుంది .