పునర్జన్మల నేపథ్యంలో అల్లు అర్జున్ సినిమా


allu arjun and vikram kumar movie in reincarnation conceptదర్శకులు విక్రమ్ కుమార్ పునర్జన్మల నేపథ్యంలో తీసిన చిత్రం ” మనం ” . అక్కినేని నాగేశ్వర రావు చివరి చిత్రమైన మనం చెరిగిపోని విజయాన్ని అందించింది ఆ కుటుంబానికి . అక్కినేని తో పాటుగా నాగార్జున , నాగచైతన్య , అఖిల్ లు నటించిన ఆ చిత్రం అక్కినేని కుటుంబానికి తీపి జ్ఞాపకంగా నిలిచింది కాగా తాజాగా విక్రమ్ కుమార్ అల్లు అర్జున్ కు పునర్జన్మల నేపథ్యంలో ఓ కథ చెప్పాడట ! అది అల్లు అర్జున్ కు నచ్చడంతో దాన్ని పూర్తిగా డెవలప్ చేయమని చెప్పాడట ….. ఇప్పుడు అదే పనిలో ఉన్నాడు విక్రమ్ కుమార్ .

విభిన్న కథా చిత్రాలతో తనకంటూ ఓ ముద్ర వేసుకున్నాడు విక్రమ్ కుమార్ కాగా పునర్జన్మల నేపథ్యంలో తెలుగులో వచ్చిన పలు చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి దాంతో ఈ కథ అల్లు అర్జున్ చేయడం ఖాయమని అంటున్నారు . వరుసగా రెండు చిత్రాలు అనుకున్న స్థాయిలో ఆడలేదు దాంతో సూపర్ హిట్ కొట్టాలని కసిగా ఉన్నాడు అల్లు అర్జున్ . ఇక విక్రమ్ కుమార్ కూడా మనం తర్వాత ఆ స్థాయి హిట్ కొట్టలేదు దాంతో అతడు కూడా కసిగానే ఉన్నాడు . పునర్జన్మల నేపథ్యం లో అల్లు అర్జున్ సినిమా ఉంటుందని తెలుస్తోంది అయితే వాళ్ళు అధికారికంగా ప్రకటించే వరకు ఎదురు చూడాల్సిందే .

English Title: allu arjun and vikram kumar movie in reincarnation concept