సైరా నరసింహారెడ్డి లో అల్లు అర్జున్


Allu arjun confirmed in syeraa narasimhareddy

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం  సైరా నరసింహారెడ్డి లో  అల్లు అర్జున్ స్పెషల్ అప్పియరెన్స్ ఇవ్వనున్నాడట . భారీ బడ్జెట్ తో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్  చేత ఓ క్యారెక్టర్ చేయించాలని దర్శకులు సురేందర్ రెడ్డి పట్టుబడుతున్నాడట . సురేందర్ రెడ్డి – అల్లు అర్జున్ ల కాంబినేషన్ లో రేసు గుర్రం వంటి బ్లాక్ బస్టర్ వచ్చిన సంగతి తెలిసిందే .

 

ఇప్పటికే జగపతి బాబు , నయనతార , అమితాబ్ బచ్చన్ , విజయ్ సేతుపతి , సుదీప్ లు నటిస్తుండగా వాళ్ళ సరసన అల్లు అర్జున్ కూడా చేరనున్నాడు . అల్లు అర్జున్ తోడవ్వడంతో మెగా ఫ్యాన్స్ కు మరింత రచ్చ రంబోలా అనే చెప్పాలి . రాంచరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది దసరా కానుకగా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .

English Title: Allu arjun confirmed in syeraa narasimhareddy