అల్లు అర్జున్ కూతురు ఫసక్ డైలాగ్ వీడియో వైరల్


Allu Arjun and His Daughter Allu Arha
Allu Arjun and His Daughter Allu Arha

అల్లు అర్జున్ కూతురు అర్హ ఓన్లీ వన్ ఫసక్ అనే డైలాగ్ ముద్దు ముద్దుగా చెబుతుంటే అల్లు అర్జున్ పగలబడి నవ్వుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది . ఫసక్ అనే డైలాగ్ ని బాగా పాపులర్ చేసింది మోహన్ బాబు అన్న విషయం తెలిసిందే . ఎప్పుడైతే మోహన్ బాబు ఫసక్ అనే డైలాగ్ వాడాడో అప్పటి నుండి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది . కట్ చేస్తే అదే డైలాగ్ ని తన కూతురు చేత చెప్పిస్తూ తెగ మురిసిపోతున్నాడు అల్లు అర్జున్ .

అల్లు అర్జున్ కు ఒక కొడుకు , ఒక కూతురు అన్న విషయం తెలిసిందే . కూతురు మరీ చిన్నారి కావడంతో ఆమె ముద్దు ముద్దుగా పలికే పదాలను వింటూ సంతోషిస్తున్నారు . ప్రస్తుతం అల్లు అర్జున్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ” అల …… వైకుంఠపురములో ” అనే చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే .