బన్నీ మళ్ళీ సుకుమార్ ను దూరం పెడుతున్నాడా?


allu arjun delaying sukumar film
allu arjun delaying sukumar film

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం అల వైకుంఠపురములో చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం కాకుండా సుకుమార్ దర్శకత్వంలో ఒకటి, వేణుశ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో ఐకాన్ చిత్రం.. ఈ రెండూ కమిట్ అయ్యాడు. అసలు ప్లాన్ ప్రకారమైతే ఈ దసరాకి సుకుమార్ సినిమా షూటింగ్ మొదలు కావాల్సి ఉంది.

అయితే దసరా అయిపోయింది కానీ సుకుమార్ సినిమా ఊసే లేదు. దసరాకి సినిమాను ప్రారంభించి నవంబర్ నుండి షూటింగ్ చేద్దామని చెప్పిన అల్లు అర్జున్ ఇప్పుడు ఎందుకు సుకుమార్ కు మొహం చాటేస్తున్నాడనేది అర్ధం కాని ప్రశ్న. ఆల్రెడీ బన్నీ సుకుమార్ కథకి ఓకే చెప్పేసి ఉన్నాడు. మరి అంతా ఓకే అనుకున్న తర్వాత ఎక్కడ తేడా కొట్టినట్లు?

సుకుమార్ సినిమా ఇంకా మొదలుకాకపోవడంతో ఒకవైపు నుండి దిల్ రాజు పావులు కదుపుతున్నాడు. ఎలాగు ఆ చిత్రం మొదలుకావట్లేదు కాబట్టి డిసెంబర్ నుండి ఐకాన్ ను మొదలుపెట్టమని అల్లు అర్జున్ ను కన్విన్స్ చేస్తున్నాడు దిల్ రాజు. రంగస్థలం వంటి భారీ హిట్ కొట్టిన తర్వాత కూడా సినిమాను ఓకే చేయించుకోవడానికి సుకుమార్ ఎన్ని తిప్పలు పడుతున్నాడో.