గొప్ప మనసు చాటుకున్న అల్లు అర్జున్


హీరో అల్లు అర్జున్ మండుటెండల్లో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులకు చల్లని మజ్జిగ అందిస్తూ తమ ఔదార్యాన్ని ప్రదర్శించారు . ఈ ఎండాకాలం పూర్తయ్యే వరకు హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో మండటెండల్లో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులకు మజ్జిగ అందించే ఏర్పాట్లు చేసాడు హీరో అల్లు అర్జున్ . ఈ పనికి అల్లు అరవింద్ కూడా తనవంతు సహాయం ప్రకటించాడు .

తండ్రీకొడుకులు ఇద్దరు కలిసి ఈ ఖర్చుని భరించడానికి సిద్ధం అయ్యారు . తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ లలో తీవ్రంగా ఎండలు ఉన్నాయి . అయితే హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో చల్లని మజ్జిగ సరఫరా చేయడానికి తగిన ఏర్పాట్లు చేసాడు అల్లు అర్జున్ . ప్రస్తుతం ఈ హీరో వేసవి తాపాన్ని తగ్గించుకోవడానికి తన భార్యా పిల్లలతో కలిసి విదేశాలకు వెళ్ళాడు . ఎండ వేడిమి తగ్గాకా తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నాడు . ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో నటించనున్నాడు .