కరోనా క్రైసిస్ ఛారిటీ కి అల్లు అర్జున్ రూ. 20 లక్షలు


Allu Arjun donated Rs 20 lakhs for corona crisis charity
Allu Arjun donated Rs 20 lakhs for corona crisis charity

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి భారతదేశవ్యాప్తంగా 21 రోజులపాటు లాక్ డౌన్ ప్రకటించారు. తద్వారా అత్యవసర మరియు వైద్య సేవలు మినహా అన్ని రకాల పనులు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి. సినిమా పరిశ్రమలో కూడా అన్ని రకాల షూటింగ్ లు, మరియు ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్,రిలీజ్,ఈవెంట్లు అన్ని రకాల కార్యక్రమాలు కూడా తాత్కాలికంగా వాయిదా పడ్డాయి.

సినీ పరిశ్రమ పై ఆధారపడిన వేలాదిమంది రోజువారీ కార్మికులను మరియు ఆదుకోవడానికి తెలుగు సినిమా పరిశ్రమ “కరోనా క్రైసిస్ చారిటీ” అనే విభాగాన్ని ప్రారంభించింది. ఈ విభాగానికి మెగాస్టార్ చిరంజీవి గారు నేతృత్వం వహిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తమ వంతు ప్రయత్నంగా విరాళాలు ప్రకటించిన తెలుగు సినిమా ప్రముఖులు అందరూ… ఈ విభాగానికి కూడా భారీ స్థాయిలో విరాళాలను ప్రకటించి, తెలుగు సినిమా కార్మికులను ఆదుకోవడానికి ముందుకొస్తున్నారు. తాజాగా వారిలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా కరోనా క్రైసిస్ చారిటీ విభాగానికి 20 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మొత్తం కలిపి ఆయన ఒక కోటీ ఇరవై ఐదు లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ప్రస్తుతం ప్రకటించిన 20 లక్షలు కూడా కలిపి మొత్తం ఆయన సహాయం ఒక కోటి నలభై ఐదు లక్షలకు చేరుకుంది. అల్లు అర్జున్ తన అభిమానులను ప్రస్తుతం ఈ లాక్ డౌన్ పీరియడ్ లో ఇంటివద్దే సురక్షితంగా గడపాలని, బయట ఎవరు తిరగవద్దు..! అనీ, అని వ్యక్తిగత పరిశుభ్రత, సామాజిక దూరం పాటించాలని.. కరోనా వైరస్ ప్రత్యక్షంగా పోరాడే ఎంతోమందికి డాక్టర్లు,వైద్య ఆరోగ్యశాఖ నిపుణులు. పోలీస్ శాఖ వారికి మన వంతు సహాయం అందించాలని అభిమానులకు విజ్ఞప్తి చేశారు.