సోష‌ల్ మీడియాలో బ‌న్నీ ఎమోష‌న‌ల్ పోస్ట్‌!


సోష‌ల్ మీడియాలో బ‌న్నీ ఎమోష‌న‌ల్ పోస్ట్‌!
సోష‌ల్ మీడియాలో బ‌న్నీ ఎమోష‌న‌ల్ పోస్ట్‌!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జ‌న్ ఈ ఏడాది `అల వైకుంఠ‌పుర‌ములో` చిత్రంతో ఇండ‌స్ట్రీ హిట్‌ని సొంతం చేసుకుని శుభారంభాన్నిచ్చారు. ఈ సంక్రాంతికి విడుద‌లైన ఈ చిత్రం బ‌న్నీ కెరీర్‌లోనే రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని సాధించిన స‌రికొత్త చరిత్ర‌ని సృష్టించింది. ఈ మూవీ స‌క్సెస్ ఆనందంలో వున్న అల్లు అర్జున్ ఆ మ‌ధ్య భావోద్వేగానికి లోనైన విష‌యం తెలిసిందే.

తాజాగా సోష‌ల్ మీడియా వేదిక‌గా మ‌రోసారి అల్లు అర్జున్ భావోద్వేగానికి లోన‌య్యారు. ఈ రోజు త‌న‌కు ప్రేమంటే ఏంటో తెలిసింద‌ని ఆస‌క్తిక‌ర‌మైన పోస్ట్ పెట్టారు. ఈ రోజు అల్లు అర్జున్ త‌న‌యుడు అల్లు అయాన్ బ‌ర్త్ డే. 2011లో బ‌న్నీ, స్నేహిరెడ్డిల వివాహం జ‌రిగింది. వారికి అల్లు అయాన్‌, అల్లు అర్హ ఇద్ద‌రు పిల్లు. ఈ శుక్ర‌వారం అల్లు అయాన్ 6వ పుట్టిన రోజు. అల్లు అర్జున్ ఇన్‌స్టా వేదిక‌గా కొన్ని ఫొటోల‌ని  షేర్ చేసి స్పందించారు.

ప్రేమంటే ఏమిటి? అని విష‌యం గురించి తాను ఎప్పుడూ ఆలోచించే వాడిన‌ని, గ‌తంలో తాను గొప్ప ఫీలింగ్స్‌ని చ‌విచూశాన‌ని, ఆ ఫీలింగ్స్ ప్రేమో కాదో నాకు క‌చ్చితంగా తెలియ‌దు. కానీ నువ్వు నా జీవితంలోకి వ‌చ్చాక నాకు ప్రేమంటే ఏమిటో తెలిసింది. నువ్వే ప్రేమ. ఐ ల‌వ్ యూ అయాన్‌. హ్యాపీ బ‌ర్త్‌డే మై బేబీ` అని అల్లు అర్జున్ పెట్టిన ఎమోష‌న‌ల్ పోస్ట్ సోష‌ల్‌మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Credit: Instagram