తాత వ‌ర్థంతి వేళ బ‌న్నీ ఎమోష‌న‌ల్ పోస్ట్‌!


తాత వ‌ర్థంతి వేళ బ‌న్నీ ఎమోష‌న‌ల్ పోస్ట్‌!
తాత వ‌ర్థంతి వేళ బ‌న్నీ ఎమోష‌న‌ల్ పోస్ట్‌!

ప్ర‌ముఖ హాస్య న‌టులు స్వ‌ర్గీయ అల్లు రామ‌లింగ‌య్యగారి వ‌ర్థంతి నేడు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మ‌న‌వ‌డు, అల్లు అర‌వింద్ త‌న‌యుడు, స్టార్ హీరో అల్లు అర్జున్ సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ వేదిక‌గా ఓ ఎమోష‌న‌ల్ పోస్ట్‌ని షేర్ చేశారు. తామూ ఆస్థాయిలో వుండ‌టానికి ప్ర‌ధాన కార‌కులైన తాత అల్లు రామ‌లింగ‌య్య‌గారిని త‌లుచుకుని ఒక్క‌సారిగా భావోద్వేగానికి లోన‌య్యారు.

`అల్లు రామ‌లింగ‌య్య‌గారు మ‌మ్మ‌ల్ని విడిచిపెట్టి వెళ్లిన ఈ రోజు నాకు బాగా గుర్తు. ఆ రోజు కంటే ఇప్పుడు నాకు ఆయ‌న గురించి బాగా తెలుసు. నేను జీవితంలో చాలా విష‌యాలు తెలుసుకున్నాను. ఆయ‌న చేసిన ప్ర‌య‌త్నాలు, పోరాటాలు, చేసిన ప్ర‌యాణాలు నన్ను ప్ర‌భావితం చేస్తుంటాయి. సినిమా ప‌ట్ల వున్న అభిరుచి కార‌ణంగా. ఈ పేద రైతు కార‌ణంగా మ‌న‌మంద‌రం ఈ రోజు ఇక్క‌డ వున్నాము` అని ఎమోష‌న‌ల్ అయ్యారు బ‌న్నీ.

అల్లు రామ‌లింగ‌య్య పాల‌కొల్లులోని సాధార‌ణ రైతు కుటుంబంలో 1922లో జ‌న్మించారు. తెలుగు సినిమా తెర‌పై హాస్యానికి చిరునామాగా నిలిచి చెర‌గ‌ని ముద్ర వేశారు. త‌న‌దైన మార్కు హాస్యంతో హాస్య‌ర‌స పాత్ర‌ల‌కు వ‌న్నె తెచ్చారు. 2004 సరిగ్గా ఇదే రోజు క‌న్నుమూశారు. ఇది అల్లు రామ‌లింగ‌య్య 16వ వ‌ర్థంతి.