అల్లు అర్జున్ కు ఆ భామ కావాలట !


Allu Arjun And Disha Patani
Allu Arjun And Disha Patani

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు హాట్ భామ దిశా పటాని కావాలట ! అలియా భట్ లేదా దిశా పటాని లలో ఎవరో ఒకరు సెట్ అయితే వాళ్లతో రొమాన్స్ చేయడానికి నేను సిద్ధం అని తన మనసులోని కోరికని బయటపెట్టాడట అల్లు అర్జున్ . తాజాగా అల్లు అర్జున్ త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే . కాగా ఆ సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమాని లైన్ లో పెట్టాడు .

వేణు శ్రీరామ్ అనే దర్శకుడు దిల్ రాజు ఆస్థానంలో కొలువై ఉన్నాడు . కాగా అతడి దర్శకత్వంలో ” ఐకాన్ ” అనే చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అల్లు అర్జున్ . ఆ చిత్రంలోనే అలియా భట్ ని హీరోయిన్ గా తీసుకోవాలని అనుకున్నారట అయితే కుదరలేదు దాంతో అల్లు అర్జున్ కళ్ళు దిశా పటాని మీద పడ్డాయి . ఈ భామ వరుణ్ తేజ్ సరసన లోఫర్ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే .