మహానటి వల్ల అల్లు అర్జున్ కు కష్టాలు


allu arjun facing problem with mahanatiమహానటి సావిత్రి బయోపిక్ మే 9న విడుదల అవుతోంది దాంతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు కష్టాలు తప్పేలా లేవు . మహానటి సినిమా వల్ల అల్లు అర్జున్ కు కష్టాలు ఏంటి ? అని అనుకుంటున్నారా ? అల్లు అర్జున్ నటించిన నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా మే 4న విడుదలైన సంగతి తెలిసిందే . అయితే విడుదల రోజునే నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రానికి డివైడ్ టాక్ వచ్చింది దాంతో అనుకున్న స్థాయిలో వసూళ్లు రావడం లేదు . రెండు రోజుల్లో కేవలం 63 కోట్లు మాత్రమే వసూల్ అయ్యాయి అది కూడా గ్రాస్ వసూళ్లు .

బాక్సాఫీస్ వద్ద అల్లు అర్జున్ సందడి లేదు సరిగ్గా అదే సమయంలో తెలుగు వాళ్లకు బాగా ప్రీతి పాత్రమైన సావిత్రి బయోపిక్ విడుదల అవుతోంది దాంతో ఆ సినిమా పెద్ద విజయం సాధించడం ఖాయమని ధీమాగా ఉన్నారు ఆ చిత్ర బృందం . పైగా రిపోర్ట్ కూడా సావిత్రి బయోపిక్ సూపర్ హిట్ అని చెబుతోంది . సావిత్రి సినిమా బాగుంటే , అల్లు అర్జున్ సినిమా తేలిపోవడం ఖాయం . అప్పుడు ఎన్నో ఆశలు పెట్టుకున్న అల్లు అర్జున్ కు పెద్ద దెబ్బే !