అల్లు అర్జున్ ఫ్యాన్స్ మేడ్ పోస్టర్ కేక


Allu Arjun fan made poster
Allu Arjun fan made poster

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే . పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం తాజాగా రెండో షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోంది . అల్లు అర్జున్ – త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో ఇంతకుముందు జులాయి , సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలు రాగా రెండు కూడా సూపర్ హిట్ అయ్యాయి దాంతో ఈ మూడో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి .

నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందన్న కాన్ఫిడెంట్ తో ఉన్నారు చిత్ర బృందం . ఇక ఈ సినిమా స్టిల్స్ లీక్ కావడంతో వాటిని పోస్టర్ లుగా చేసి సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా చేస్తున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్ . అల్లు అర్జున్ ఫ్యాన్స్ చేసిన పోస్టర్ లుక్ బాగుంది దాంతో దాన్ని షేర్ చేస్తున్నారు బన్నీ ఫ్యాన్స్ .