అపర్ణ ని రేప్ చేస్తామంటున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్


allu arjun fans harassed malayalam female crtitic aparna prashanti

నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రం తెలుగులోనే కాకుండా మలయాళంలో కూడా విడుదలైన విషయం తెలిసిందే . అయితే ఆ సినిమా బాగోలేదని క్రిటిక్ అపర్ణ ప్రశాంతి రివ్యూ రాసింది , అంతే కేరళ లోని అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు ఎక్కడా లేని కోపం వచ్చింది వెంటనే అపర్ణ ప్రశాంతి ని రేప్ చేస్తామని బెదిరిస్తున్నారు అంతేనా అమ్మనా బూతులు కూడా తిడుతున్నారు దాంతో పోలీసులను ఆశ్రయించింది అపర్ణ . పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టినప్పటికీ బన్నీ ఫ్యాన్స్ మాత్రం భయపడటం లేదు ఇంకా ఆమెని ట్రోల్ చేస్తూనే ఉన్నారు దాంతో మరోసారి మీడియా ముందుకు వచ్చింది .

నేను చేసిన తప్పు కేవలం రివ్యూ రాయడమే ! మలయాళ సూపర్ స్టార్స్ అయిన మోహన్ లాల్ , మమ్ముట్టి ల చిత్రాలకు కూడా రివ్యూ లు రాసాను కానీ వాళ్ళ నుండి కానీ ఆ హీరోల ఫ్యాన్స్ కానీ నన్ను ఏమనలేదు కానీ బన్నీ ఫ్యాన్స్ మాత్రం నన్ను రేప్ చేసి బుద్ధిచెబుదామని అంటున్నారని , అంతేకాకుండా నా తల్లిదండ్రులను కూడా తిట్టడం ఏంటి ? ఇదేం సంప్రదాయం అంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది . నా రివ్యూ మీకు నచ్చనంత మాత్రాన నేను దేశ ద్రోహినా ? అంటూ ప్రశ్నిస్తోంది . అయితే కొంతమంది అత్యుత్సాహం కలిగిన అభిమానులు చేస్తున్న వెర్రి చేష్టల వల్ల హీరోలకు ఇబ్బంది కలుగుతోంది కానీ ఆ విషయాన్నీ వాళ్ళు మర్చిపోయి మహిళలను టార్గెట్ చేయడం శోచనీయమే !