సుకుమార్ కోసం బ‌న్నీ తిరుగుతున్నాడుగా!



సుకుమార్ కోసం బ‌న్నీ తిరుగుతున్నాడుగా!
సుకుమార్ కోసం బ‌న్నీ తిరుగుతున్నాడుగా!

క‌రోనా వైర‌స్ కార‌ణంగా లాక్‌డౌన్ విధించ‌డంతో సామాన్య జ‌నాల నుంచి సెల‌బ్రిటీల వ‌ర‌కు ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారు. అయితే ఈ స‌మ‌యంలో బ‌య‌టికి వ‌చ్చిన స్టార్ హీరో బ‌న్నీ. కేబీర్ పార్క్‌లో .. సిటీ ఔట్ స్క‌ర్ట్‌లో వాకింగ్ చేస్తూ క‌నిపించి స‌ర్‌ప్రైజ్ ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ప్ర‌స్తుతం అన్ లాక్‌లో భాగంగా షూటింగ్‌లు పునః ప్రారంభం కావ‌డంతో స్టార్ హీరోలంతా బ‌య‌టికి రావ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు.

ఈ నేప‌థ్యంలో బ‌న్నీ చేస్తున్న ప‌ని చ‌ర్చ‌నీయాంశంగా మారింది. బ‌న్నీ ప్ర‌స్తుతం `పుష్ప‌` చిత్రంలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. సుకుమార్ తెర‌కెక్కిస్తున్న ఈ మూవీ షూటింగ్ వైర‌స్ కార‌ణంగా ఆగిపోయింది. త్వ‌ర‌లో రెగ్యుల‌ర్ షూటింగ్‌ని ప్రారంభించాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఫారెస్ట్‌ నేప‌థ్యంలో సాగే సినిమా కావ‌డంతో ఈ మూవీకి సంబంధించిన కీల‌క ఘ‌ట్టాల‌ని ఫారెస్ట్ నేప‌థ్యంలో షూట్ చేయ‌బోతున్నారు. ఇందు కోసం లొకేష‌న్స్‌ని ఫైన‌ల్ చేసినా బ‌న్నీ మాత్రం ఇత‌ర లొకేష‌న్‌ల‌ని ఎంచుకుంటున్న‌ట్టు తెలుస్తోంది.

ఇందులో భాగంగానే బ‌న్నీ అదిలాబాద్‌కు చెందిన కుంతాల జ‌ల‌పాతం, మ‌హారాష్ట్ర‌లోని తిప్పేశ్వ‌ర్ అడ‌వుల‌కు వెళ్లిన‌ట్టు చెబుతున్నారు. ముందు బ‌న్నీ స‌ర‌దాగా విజిట్ కోసం వెళ్లాడ‌ని ప్ర‌చారం జ‌రిగింది. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో స‌ర‌దాగా ఓ సెల‌బ్రిటీ ఇలాంటి ప్ర‌దేశాల‌కు వెళ్ల‌డం ఇంపాజిబుల్‌ కాబ‌ట్టి బ‌న్నీ `పుష్ప‌` కోసం లొకేష‌న్‌ల వేట‌లో భాగంగానే ఈ ప్ర‌దేశాల‌కు వెళ్లార‌ని ఇన్ సైడ్ టాక్‌.