ఎన్టీఆర్ చరణ్ ల సినిమాలో అల్లు అర్జున్


ఎన్టీఆర్ – చరణ్ లతో భారీ మల్టీస్టారర్ చిత్రానికి ఎస్ ఎస్ రాజమౌళి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే . దసరా సందర్బంగా ఈఏడాది ఈ సినిమా ప్రారంభం కానుంది కాగా ఈ చిత్రంలో కీలక పాత్రలో అల్లు అర్జున్ కూడా నటించనున్నట్లు తెలుస్తోంది . ప్రస్తుతం చర్చల దశలోనే ఉన్న ఈ సినిమాలో ఎక్కువ మంది ని ఇన్వాల్వ్ చేయడం ద్వారా రికార్డుల మోత మోగించాలని భావిస్తున్నాడట జక్కన్న . బాహుబలి ప్రపంచ వ్యాప్తంగా భారీ విజయాన్ని సాధించి ప్రభంజనం సృష్టించింది దాంతో జక్కన్న పై అంచనాలు స్కై లెవల్లో ఉన్నాయి .

అందుకు తగ్గట్లుగా ఈ మల్టీస్టారర్ చిత్రం ఉండాలని పైగా తెలుగులో ఇద్దరు స్టార్ హీరోలు కలిసి చేసే సినిమా అంటే ఇక ఆ అంచనాలు చెప్పతరమా ? అందుకే విలన్ గా రవితేజ ని తీసుకోవాలని భావిస్తున్నాడట అలాగే మరో కీలక పాత్రలో అల్లు అర్జున్ కూడా నటించనున్నట్లు తెలుస్తోంది . ఇంతమంది తెలుగు స్టార్స్ నటిస్తే ఇక ఆ సినిమా ని ఊహించగలమా ? దాని రేంజ్ ఏంటి అన్నది .