నితిన్ వెడ్డింగ్‌పై బ‌న్నీ ఇంట్రెస్టింగ్ ట్వీట్‌!Allu arjun Intreting tweets on Nithin's Wedding
Allu arjun Intreting tweets on Nithin’s Wedding

వ‌రుస ఫ్లాప్‌ల తరువాత నితిన్ `భీష్మ‌` విజ‌యంతో నితిన్ మ‌ళ్లీ విజ‌యాల బాట ప‌ట్టాడు. వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలో సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇటీవ‌ల విడులైన ఈ చిత్రం ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల‌కు 10 కోట్ల‌కు మించి వ‌సూలు చేసి ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. చాలా రోజుల త‌రువాత నితిన్ విజ‌యం సాధించ‌డంతో ఇండ‌స్ట్రీ నుంచి ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది. తాజాగా స్టైలిష్ స్టార్  అల్లు అర్జున్ హీరో నితిన్ `భీష్మ‌`స‌క్సెస్‌పై, ఆయ‌న వివాహంపై స్పందించ‌డం ఆస‌క్తిగా మారింది.

చిత్ర బృంధాన్ని అభినందిస్తూనే నితిన్ వెడ్డింగ్‌పై ట్వీట్ చేశారు. స‌రైన స‌మ‌యంలో నితిన్ మంచి విజ‌యాన్ని సొంతం చేసుకున్నాడ‌ని, మంచి స‌మ‌యంలోనే మంచి విష‌యాలు జ‌రుగుతుంటాయ‌ని, నితిన్‌ని చూస్తుంటే త‌న‌కు ఎంతో ఆనందంగా వుంద‌ని ఈ ఆనందంలో వెడ్డింగ్ ప‌నులు మ‌రింత సంద‌డిగా సాగుతాయ‌ని బ‌న్నీ చెప్పుకొచ్చాడు. భీష్మ‌` టీమ్ గ‌రించి మాట్లాడుతూ ఓ మంచి ఎమోష‌న‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌ని తెర‌కెక్కించిన వెంకీ కుడుములకు కంగ్రాట్స్‌, రష్మిక నువ్వు ఆల్ రౌండ‌ర్‌వి, ఈ ఏడాది జ‌న‌వ‌రి. ఫిబ్ర‌వ‌రి మీకు మ‌రింత గొప్ప‌గా జ‌రిగాయి. మొత్తం చిత్ర బృందానికి మ‌రోసారి కంగ్రాట్స్ అని బ‌న్నీ ట్వీట్ చేశారు.

సంక్రాంతికి `అల వైకుంఠ‌పుర‌ములో` చిత్రంతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ని సొంతం చేసుకున్న అల్లు అర్జున్ ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌ని చేస్తున్న విష‌యం తెలిసిందే. మైత్రీ మూవీమేక‌ర్స్ నిర్మించ‌నున్న ఈ చిత్రంలో బ‌న్నీ లారీడ్రైవ‌ర్‌గా ఊర‌మాస్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమా తాజా షెడ్యూల్ ప్రారంబః కాబోతోంది.