మహేష్ బాటలోనే అల్లు అర్జున్


Allu Arjun investments in Multiplex

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు బాటలో పయనించడానికి సిద్దమయ్యాడు అల్లు అర్జున్ . మహేష్ బాబు బాటలో అల్లు అర్జున్ పయనించడం ఏంటి ? అని అనుకుంటున్నారా ? మహేష్ బాబు ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టాడు . ఏషియన్ ఫిలిమ్స్ వాళ్లతో కలిసి మల్టీప్లెక్స్ థియేటర్ లను నిర్మించాడు హైదరాబాద్ లో . ఇప్పటికే అవి ప్రారంభం కావాల్సి ఉండగా కాస్త ఆలస్యంగా డిసెంబర్ 2 నుండి ప్రారంభం కానున్నాయట . మహేష్ మల్టీప్లెక్స్ స్టార్ట్ కాకుండానే ఆ మల్టీప్లెక్స్ లకు బ్రహ్మాండమైన క్రేజ్ వచ్చింది . ఇక స్టార్ట్ అయితే దాని రేంజ్ ఏంటో ?

మహేష్ బాబు లాగే అల్లు అర్జున్ కూడా మల్టీప్లెక్స్ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి సిద్దమయ్యాడు . అదికూడా ఏషియన్ వాళ్ళతోనే . అమీర్ పేటలోని సత్యం థియేటర్ చాలా ఫేమస్ కాగా ఆ చోట అల్లు అర్జున్ – ఏషియన్ ” A A A ” మల్టీప్లెక్స్ కు శ్రీకారం చుట్టనున్నారట . డబ్బు సంపాదించడం గొప్ప కాదు దాన్ని నిల్వ చేయడం , లాభాలు వచ్చే రంగాల్లో పెట్టుబడులు పెట్టడం తెలివి గల వాళ్ళ పని ఇప్పుడు అదేపని చేస్తున్నాడు అల్లు అర్జున్ .

English Title: Allu Arjun investments in Multiplex