బన్నీ, కళ్యాణ్ రామ్ కలిసి ఒకేసారి..

Allu Arjun And Kalyan Ram
బన్నీ, కళ్యాణ్ రామ్ కలిసి ఒకేసారి..

ఈరోజుల్లో ప్రమోషన్స్ కు ఎక్కువగా పనికొచ్చేవి టీజర్, ట్రైలర్. ఇవి ఎంత పక్కాగా, ఎంటర్టైనింగ్ గా, జనాలను ఆకర్షించే విధంగా కట్ చేయగలిగితే అక్కడే మీరు సగం విజయం సాధించేసినట్లు. ఆ ప్రోమోలు సరైన సమయంలో విడుదల చేయడం కూడా ముఖ్యంగా. హాలిడే సీజన్ లో ప్రోమో విడుదల చేస్తే అది జనాలకు ఎక్కువ రీచ్ కావడం జరుగుతూ ఉంటుంది. ఇదే సూత్రాన్ని ఇప్పుడు బన్నీ, కళ్యాణ్ రామ్ అనుసరించబోతున్నారు.

ప్రస్తుతం అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అల వైకుంఠపురములో చిత్రంలో నటిస్తున్నాడు. సినిమా ఇప్పటికే సగం షూటింగ్ పూర్తి చేసుకోవడం కూడా జరిగింది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర టీజర్ ను దసరా కానుకగా విడుదల చేయనున్నారు. మొదట త్రివిక్రమ్ పుట్టినరోజు సందర్భంగా నవంబర్ లో విడుదల చేయాలని భావించినా తర్వాత మనసు మార్చుకుని డేట్ ను ముందుకు జరిపారు.

మరోవైపు నందమూరి కళ్యాణ్ రామ్, సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ఎంత మంచివాడవురా చిత్ర ఘాటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈ చిత్ర టీజర్ కూడా దసరాకే విడుదలవుతుంది. వీటితో పాటు మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు టీజర్ దసరాకే వచ్చే అవకాశాలున్నాయి.