బ‌న్నీ స్లాంగ్ మారుస్తున్నారా!


బ‌న్నీ స్లాంగ్ మారుస్తున్నారా!
బ‌న్నీ స్లాంగ్ మారుస్తున్నారా!

`రంగ‌స్థ‌లం` సినిమాతో రామ్‌చ‌ర‌ణ్‌లోని కొత్త కోణాన్ని ప‌రిచ‌యం చేశారు సుకుమార్‌. సౌండ్ ఇంజినీర్‌గా చిట్టిబాబు పాత్ర‌లో రామ్‌చ‌ర‌ణ్ న‌టించాడు అన‌డం కంటే జీవించాడు అన‌డం క‌రెక్టేమో అనేంత‌గా ఆ పాత్ర‌ని ర‌క్తిక‌ట్టించారు. గెట‌ప్‌, మీస‌క‌ట్టు, స్లాంగ్‌.. ఇలా ప్ర‌తి విష‌యంలోనూ సుకుమార్ చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుని చిట్టిబాబు పాత్ర‌ని మ‌లిచారు.

అదే స్థాయిలో అల్లు అర్జున్ పాత్ర‌ని తాజా చిత్రం కోసం డిజైన్ చేశార‌ట‌. `అల వైకుంఠ‌పుర‌ములో` చిత్రంతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ని సొంతం చేసుకున్న అల్లు అర్జున్ ప్ర‌స్తుతం సుక్కు సినిమా కోసం క‌స‌ర‌త్తులు చేస్తున్నార‌ట‌. ఇప్ప‌టికే ఈ చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్ షెడ్యూల్ బ‌న్నీ లేకుండా పూర్త‌యింది. నెక్స్ట్ త‌దుప‌రి షెడ్యూల్ ప్రారంభం కాబోంది. ఈ షెడ్యూల్ లో బ‌న్నీ ఎంట‌ర్ కాబోతున్నారు. ఇందులో లాకీ డ్రైవ‌ర్‌గా మాస్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న బ‌న్నీ ఇందు కోసం బారు గడ్డం, మీసం పెంచుతున్నార‌ట‌.

అంతేనా ఇందులో బ‌న్నీ చిత్తూరు స్లాంగ్‌లో మాట్లాడబోతున్నార‌ట‌. ఇందు కోసం ఇప్ప‌టికే చిత్తూరు చెందిన లోక‌ల్ క‌ళాకారులని హైద‌రాబాద్ ర‌ప్పించి ఆ భాష‌లో డైలాగ్‌లు ఎలా చెప్పాలో బ‌న్నీ ప్రాక్టీస్ చేస్తున్నార‌ని తెలిసింది. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మైత్రీ మూవీమేక‌ర్స్ నిర్మిస్తోంది. విజ‌య్ సేతుప‌తి ఇందులో విల‌న్‌గా న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.