`పుష్ప‌` ఈవెంట్‌లో అల్లు అర్జున్ ఫోన్ మిస్‌!

`పుష్ప‌` ఈవెంట్‌లో అల్లు అర్జున్ ఫోన్ మిస్‌!
`పుష్ప‌` ఈవెంట్‌లో అల్లు అర్జున్ ఫోన్ మిస్‌!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ న‌టిస్తున్న చిత్రం `పుష్ప‌`. సుకుమార్ ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్నారు. ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని ముత్యంశెట్టి మీడియాతో క‌లిసి మైత్రీ మూవీమేక‌ర్స్ నిర్మిస్తున్నారు. బ‌న్నీ ఇందులో పుష్ప‌రాజ్‌గా ఊర‌మాస్ పాత్ర‌లో లారీ డ్రైవ‌ర్‌గా న‌టిస్తున్నారు. ఇటీవ‌ల బ‌న్నీ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఒక‌రోజు ముందుగానే ఈ మూవీ టీజ‌ర్‌ని బుధ‌వారం రాత్రి చిత్ర బృందం విడుద‌ల చేసింది.

ఇందు కోసం ఓ భారీ ఈ వెంట్‌ని నిర్వ‌హించింది. ఇక్క‌డే బ‌న్నీ పుట్టిన రోజు వేడుక‌ల్ని కూడా నిర్వ‌హించింది. దీంతో దాదాపు ఏడాది త‌రువాత బ‌న్నీ ఈవెంట్ కావ‌డంతో అభిమానులు భారీ సంఖ్య‌లో త‌ర‌లివ‌చ్చారు. వారిని చూసి హీరో అల్లు అర్జున్ కూడా త‌న‌ని తాను కంట్రోల్ చేసుకోలేక‌పోయారు. ఫ‌స్ట్ ప్రెస్ మీట్‌లోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిన‌ట్టుగా `పుష్ప‌` సినిమాకు సంబంధించిన అన్ని విష‌యాలు చెప్ప‌కొచ్చారు. అభిమానుల కేరింత‌ల మ‌ధ్య జ‌రిగిన ఈ ఈవెంట్‌లో బ‌న్నీ త‌న ఫోన్‌ని పోగొట్టు కోవ‌డం ప్ర‌స్తుతం హాట్ టాపిక్‌గా మారింది.   ‌

బ‌న్నీఈవెంట్ చివ‌ర్లో అభిమానుల‌తో క‌లిసి సెల్ఫీ దిగ‌డానికి ముందుకొచ్చారు. ఈ క్ర‌మంలోనే అభిమానులంతా ఒక్క‌సారిగా ఎగ‌బ‌డ‌టంతో బౌన్సర్లు వారిని నియంత్రించడానికి చాలా కష్టపడాల్సి వ‌చ్చింది. అదే స‌మయంలో అల్లు అర్జున్ తన మొబైల్ ఫోన్‌ను కోల్పోయాడని తెలిసింది.