ఎవరు చిత్రం అల్లు అర్జున్ కు బాగా నచ్చిందట


Allu Arjun loved Evaru Movie Congratulated to the entire team of Evaru
Allu Arjun loved Evaru Movie Congratulated to the entire team of Evaru

అడవి శేష్ హీరోగా నటించిన ఎవరు చిత్రం అల్లు అర్జున్ కు బాగా నచ్చిందట . ఎవరు బాగా నచ్చిందని ట్వీట్ చేసాడు అల్లు అర్జున్ . గతరాత్రి సినిమా చూసాను ,మర్డర్ మిస్టరీ తో తెరకెక్కిన ఎవరు చిత్రాన్ని అద్భుతంగా తీశారు . అడవి శేష్ హ్యాట్రిక్ కొట్టాడు, మంచి సినిమాలు చేస్తున్నాడు ఎవరు యూనిట్ కు నా శుభాకాంక్షలు అంటూ అభినందనలు తెలిపాడు అల్లు అర్జున్ .

ఈమధ్య విజయవంతమైన చిత్రాలను అభినందిస్తూ పోస్ట్ లు పెడుతున్నాడు అల్లు అర్జున్ . ఆగస్టు 15 న విడుదలైన ఎవరు చిత్రం యునానిమస్ గా హిట్ టాక్ సొంతం చేసుకుంది . అడవి శేష్ , రెజీనా కాసాండ్రా , నవీన్ చంద్ర తదితరులు నటించగా వెంకట్ రాంజీ దర్శకత్వంలో పివిపి ఈ చిత్రాన్ని నిర్మించారు . సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఎవరు కి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు .