చావుబతుకుల్లో ఉన్న ఫ్యాన్ ని కలిసిన బన్నీ


allu arjun meet his fan

బన్నీ అలియాస్ అల్లు అర్జున్ చావు బతుకుల్లో ఉన్న తన అభిమాని ని కలిసి అతడితో కొంతసేపు గడిపి అతడికి సంతోషాన్ని అందించాడు . సంఘటన వివరాలలోకి వెళితే …… విశాఖపట్టణం సమీపంలోని అనకాపల్లి లో సాయి గణేష్ అనే అల్లు అర్జున్ అభిమాని బోన్ క్యాన్సర్ తో కొంతకాలంగా బాధపడుతున్నాడు . అసలే బోన్ క్యాన్సర్ ఆపై తన అభిమాన హీరో ని చూడాలని ఆశించే వాడు దాంతో అతడి కోరికని అల్లు అర్జున్ చెవిన పడేలా చేయడంతో అతడి కోరిక ని మన్నించిన బన్నీ సాయి గణేష్ దగ్గరకు వెళ్లి మరీ ఓదార్చాడు .

అల్లు అర్జున్ స్వయంగా వచ్చి ఓదార్చడంతో సంతోషంతో పరవశించి పోయాడు ఆ అభిమాని . తాజాగా అల్లు అర్జున్ నటించిన నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా విడుదలై ప్రశంసలు అందుకుంటోంది . అల్లు అర్జున్ నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా లభిస్తున్నాయి .