సుక్కు మ‌ళ్లీ పాత ఫార్మాట్‌నే న‌మ్ముకున్నాడా?


సుక్కు మ‌ళ్లీ పాత ఫార్మాట్‌నే న‌మ్ముకున్నాడా?
సుక్కు మ‌ళ్లీ పాత ఫార్మాట్‌నే న‌మ్ముకున్నాడా?

`ఆర్య‌`.. ఒక వ్య‌క్తి ప్రేమించిన అమ్మాయిని ప్రేమిస్తూ త‌న చుట్టూరి తిరిగి చివ‌రికి త‌న‌ని ప్రేమించేలా చేయం అనే వ‌న్‌సైడ్ ల‌వ్ కాన్సెప్ట్‌తో వ‌చ్చిన ఈ చిత్రం అప్ప‌ట్లో మంచి విజ‌యాన్ని సాధించింది. ఆ త‌రువాత కొంత విరామం తీసుకుని అదే త‌ర‌హా క్యారెక్ట‌రైజేష‌న్‌తో సుకుమార్ చేసిన చిత్రం `ఆర్య 2`. అంతగా కాక‌పోయినా ఫ‌ర‌వాలేద‌నిపించింది.

తాజాగా మ‌ళ్లీ ఇదే ఫార్మాట్‌ని త‌న కొత్త చిత్రానికి ఫాలో అవుతున్నాడ‌ట సుకుమార్‌. హీరోని నెగెటీవ్ షేడ్స్‌లో ప్ర‌జెంట్ చేసి రెండు సార్లు స‌క్సెస్ సాధించిన సుకుమార్ ముచ్చ‌ట‌గా మూడ‌వ సారి కూడా అదే చేయ‌బోతున్నాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ ఓ భారీ చిత్రాన్ని రూపొందిస్తున్న విష‌యం తెలిసిందే. గంధ‌పు చెక్క‌ల స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో ఈ సినిమా `రంగ‌స్థ‌లం` త‌ర‌హాలో స‌హ‌జ‌త్వానికి ద‌గ్గ‌ర‌గా రూపొందుతోంది. త్వ‌ర‌లోనే ఈ చిత్ర రెగ్యుల‌ర్ షూటింగ్‌లో హీరో అల్లు అర్జున్ పాల్గొన బోతున్నాడు.

లారీ డ్రైవ‌ర్‌గా ఊర‌మాస్ పాత్ర‌లో న‌టిస్తున్న ఈ చిత్రంలో ఆయ‌న పాత్ర నెగెటివ్ ట‌చ్‌తో సాగుతుంద‌ని, అత్యంత క్రూరంగా ఈ పాత్ర ఆలోచ‌న‌లు వుంటాయ‌ని తెలుస్తోంది. విల‌న్ పాత్ర‌లో త‌మిళ హీరో విజ‌య్ సేతుప‌తి న‌టిస్తున్నారు. ఇందు కోసం ఆయ‌న దాదాపు 10 కోట్లు పారితోషికం డిమాండ్ చేసిన‌ట్టు తెలుస్తోంది.