అల్లు అర్జున్ కసిగా ఉన్నాడట


allu arjun next with vikram kumarనమ్ముకున్న సినిమా నట్టేట ముంచడంతో అల్లు అర్జున్ ఈసారి ఎలాగైనా సరే హిట్ కొట్టాలని కసిగా ఉన్నాడట ! వక్కంతం వంశీ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అనే సినిమా చేసిన విషయం తెలిసిందే . అయితే ఎంతో నమ్మకం పెట్టుకొని చేసిన ఆ సినిమా ఘోర పరాజయం పొందడంతో షాక్ అయ్యాడు అల్లు అర్జున్ . దాంతో తన తదుపరి చిత్రం ఏంటి అన్నది త్వరగా తేల్చకండా నాన్చి నాన్చి తాజాగా ఓకే చేసాడట !

ఇంతకీ ఓకే చేసిన సినిమాకు దర్శకుడు ఎవరో తెలుసా ……. మనం వంటి విభిన్న కథా చిత్రానికి దర్శకత్వం వహించిన ” విక్రమ్ కుమార్ ” . ఈ దర్శకుడు పలు చిత్రాలకు దర్శకత్వం వహించినప్పటికీ మనం వెరీ వెరీ స్పెషల్ . ఆ సినిమాకు ముందు అలాగే ఆ సినిమా తర్వాత పలు చిత్రాలు చేసాడు కానీ మనం అతడి కెరీర్ లో మైలురాయిగా నిలిచింది .

విక్రమ్ తో చేసే సినిమాలో అన్ని అంశాలు ఉండాలని అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడట అల్లు అర్జున్ . ఇక అల్లుఅరవింద్ ఎలాగు ఉండనే ఉన్నాడు అతడు కూడా చూసుకుంటున్నాడట తనయుడి కి పెద్ద హిట్ ఇవ్వాలని . జనరంజకమైన చిత్రాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నాడట అల్లు అర్జున్ . త్వరలోనే ఈ విషయం పై అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది .

English Title: allu arjun next with vikram kumar