ముంబైలో బ‌న్నీ ఏం జ‌రుగుతోంది?Allu Arjun plannig to by own house in mumbai
Allu Arjun plannig to by own house in mumbai

ఈ సంక్రాంతి స‌మ‌రం ర‌స‌వ‌త్తంగా సాగింది. ఇద్ద‌రు టాప్ హీరోలు పోటీప‌డ‌టంతో పండ‌గ వాతావ‌ర‌ణం వేడెక్కింది. జ‌న‌వ‌రి 11న `స‌రిలేరు నీకెవ్వ‌రు`, 12న `అల వైకుంఠ‌పుర‌ములో` చిత్రాలు ప్రేక్ష‌కుల ముందుకొచ్చాయి. ఆడియో ప‌రంగా రెండు సూప‌ర్ డూప‌ర్ హిట్‌లుగా నిలిచాయి. అయితే అల్లు అర్జున్ హీరోగా మాట‌ల మాంత్రికుడు రూపొందించిన `అల వైకుంఠ‌పుర‌ములో` హ్యూజ్ క్రేజ్‌ని సొంతం చేసుకోవ‌డంతో ఇండ‌స్ట్రీ హిట్‌గా నిలిచింది.

ఈ సినిమా స‌క్సెస్ కిక్ ఇచ్చిన ఆనందంలో అల్లు అర్జున్ ఇండ‌స్ట్రీలో వ‌రుస పార్టీల‌తో సంబ‌రాలు జ‌రుపుకున్నారు. జాతీయ మీడియాల‌తో ఇంట్రాక్ట్ అయ్యారు. అయితే తాజాగా అల్లు అర్జున్ ఈ సినిమా రిలీజ్‌కి ముందు ముంబైలో సొంతంగా ఓ ఇండిపెండెంట్ ఫ్లాట్‌ని తీసుకోవాల‌ని ప్లాన్ చేశార‌ట‌. ఇప్ప‌టికే ఓ ఫ్లాట్‌ని  ఫైన‌ల్ చేశార‌ని, త్వ‌ర‌లోనే ఆ ఫ్లాట్‌ని సొంతం చేసుకోబోతున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

బాలీవుడ్‌లో సినిమా చేయాల‌ని గ‌త కొంత కాలంగా అల్లు అర్జున్ ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. అందు కోస‌మే అక్క‌డ ఓ ఫ్లాట్‌ని ఏర్పాటు చేసుకోవాల‌ని భావిస్తున్నార‌ట‌.  తాజా వార్త‌ల‌పై అల్లు అర్జున్ స్పందిస్తూ ముంబైలో మాకు ఎలాంటి ఫ్లాట్స్ లేవు. గీతా ఆర్ట్స్‌కి ఓ గెస్ట్ హౌజ్ మాత్ర‌మే వుంది. త్వ‌ర‌లో ముంబైలో ఓ సొంత ఫ్లాట్‌ని ఏర్పాటు చేసుకోవాల‌ని ప్లాన్ చేస్తున్నాం. అని స‌న్నిహిత వ‌ర్గాల‌తో బ‌న్నీ చెప్పిన‌ట్టు తెలిసింది.