బన్నీకి బాలీవుడ్ దోమ కుట్టిందిగా!Allu Arjun
బన్నీకి బాలీవుడ్ దోమ కుట్టిందిగా!

రెబెల్ స్టార్ ప్రభాస్ కు బాలీవుడ్ లో మార్కెట్ స్థిరపడిపోయింది. సాహో సినిమాకు వచ్చిన టాక్, బాలీవుడ్ లో ఈ చిత్రానికి వచ్చిన కలెక్షన్స్ చూస్తే ఈ విషయం స్పష్టమైంది. ఇక రామ్ చరణ్, ఎన్టీఆర్ కూడా నెక్స్ట్ లైన్లో ఉన్నారు. రాజమౌళి సినిమాతో బాలీవుడ్ లో వాళ్ళు పాగా వేయడం పక్కా. ఇవన్నీ గమనిస్తున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు కూడా బాలీవుడ్ లో ఓ రాయి వేస్తే పోయేదేముంది అనిపించిందట. అందుకే తన దగ్గర వచ్చే దర్శకులను పాన్ ఇండియా లెవెల్లో సేల్ అయ్యే సబ్జెక్ట్ ను తీసుకురమ్మని అడుగుతున్నాడట.

ముందుగా వేణు శ్రీరామ్ వినిపించిన ఐకాన్ స్క్రిప్ట్ ను బాలీవుడ్ వాళ్లకు కూడా నచ్చేలా మార్చమని సూచించాడట. అందుకే ఐకాన్ ను వెనక్కి నెట్టి ఈలోగా సుకుమార్ సినిమాను పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నాడట. బాలీవుడ్ ఆలోచనలు బన్నీకి రావడానికి మరో ప్రధాన కారణం.. అక్కడ తన డబ్బింగ్ సినిమాలు యూట్యూబ్ లో మిలియన్ల కొద్దీ వ్యూస్ తీసుకొస్తుండడమేనని తెలుస్తోంది. మరి అల్లు అర్జున్ బాలీవుడ్ ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.