పుష్ప‌రాజ్ డ‌బ్బింగ్ మొద‌లైంది!

పుష్ప‌రాజ్ డ‌బ్బింగ్ మొద‌లైంది!
పుష్ప‌రాజ్ డ‌బ్బింగ్ మొద‌లైంది!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ న‌టిస్తున్న హై వోల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రం `పుష్ప‌`. స్టార్ డైరెక్ట‌ర్ స‌సుకుమార్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. మైత్రీ మూవీమేక‌ర్స్ బ్యాన‌ర్ పై న‌వీన్ యెర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుంది. ర‌ష్మిక మంద‌న్న‌హీరోయిన్‌గా పక్కా ప‌ల్లెటూరి అమ్మాయిగా క‌నిపించ‌బోతోంది.

అల్లు అర్జున్ పుష్ప‌రాజ్ పాత్ర‌లో ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ చేసే ఊర‌మాస్ లారీ డ్రైవ‌ర్‌గా క‌నిపించ‌బోతున్నారు. ఇటీవ‌ల విడుద‌లైన ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్‌, తాజాగా విడుద‌ల చేసిన ప్రీ లుడ్ సినిమాపై అంచ‌నాల్ని పెంచేస్తోంది. ఈ మూవీలోని బ‌న్నీ అవ‌తారాన్ని విజువ‌ల్‌గా మేక‌ర్స్ చూపించ‌బోతున్నారు. గురు‌వారం బ‌న్నీ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ బుధ‌‌వారం సాయంత్రం 4గంట‌ల‌కు విడుద‌ల చేయ‌బోతున్నారు.

ఇదిలా వుంటే ఈ మూవీ డ‌బ్బింగ్ ప‌నులు కూడా మొద‌ల‌య్యాయి. చిత్ర బృందం మంగ‌ళ‌వారం ఈ మూవీ డ‌బ్బింగ్‌ప‌నుల్ని ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా జ‌రిగిన పూజా కార్య‌క్ర‌మాల్లో హీరో అల్లు అర్జున్‌, ద‌ర్శ‌కుడు సుకుమార్ పాల్గొన్నారు. ప‌వ‌ర్‌ఫుల్ విల‌న్‌గా మ‌ల‌యాళ న‌టుడు ఫ‌హ‌ద్ ఫాజిల్ న‌టిస్తున్నారు. దేవి శ్రీప్ర‌సాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని ఆగ‌స్టు 13న వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఐదు భాష‌ల్లో రిలీజ్ చేస్తున్నారు.