అల్లు అర్జున్ రిజెక్ట్ చేస్తే నాని ఓకే చెప్పాడు


Allu arjun rejected nani accepted

అల్లు అర్జున్ విక్రమ్ కుమార్ తో ఓ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు . కట్ చేస్తే ఫస్టాఫ్ బాగుంది సెకండాఫ్ బాగోలేదని చెప్పి విక్రమ్ కుమార్ స్క్రిప్ట్ ని రిజెక్ట్ చేసాడు అల్లు అర్జున్ కట్ చేస్తే అదే స్క్రిప్ట్ ని నాని కి చెబితే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట . అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన స్క్రిప్ట్ నాని యాక్సెప్ట్ చేసాడు అంటూ గుసగుసలు మొదలయ్యాయి ఫిలిం నగర్లో . నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా ఘోర పరాజయం పొందడంతో చాలా రోజుల పాటు బ్రేక్ తీసుకున్నాడు అల్లు అర్జున్ . చివరకు విక్రమ్ కుమార్ చెప్పిన లైన్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి డెవలప్ చేయమని చెప్పాడు దాంతో విక్రమ్ కుమార్ అదేపనిలో పడ్డాడు కట్ చేస్తే త్రివిక్రమ్ నుండి పిలుపు రావడంతో రిస్క్ తీసుకోవడం ఎందుకని విక్రమ్ సినిమాని రిజెక్ట్ చేసాడు .

ఇంకేముంది విక్రమ్ కుమార్ కూడా ప్రత్యామ్నాయాన్ని చూసుకున్నాడు . అల్లు అర్జున్ రిజెక్ట్ చేయడంతో నాని దగ్గరకు వెళ్ళాడట ! స్క్రిప్ట్ వినిపించడం నానికి నచ్చడం జరిగిపోయింది , వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు . అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన స్క్రిప్ట్ నాని ఓకే చేసాడంటే అది హిట్ అవుతుందా ? లేదా ? అన్నది తెలియాలంటే నాని సరైన పని చేశాడా ? అన్నది తెలియాలంటే ఆ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వేచి చూడక తప్పదు .

English Title: Allu arjun rejected nani accepted