నోటా చిత్రంలో ఏ హీరో నటించాలో తెలుసా


Allu arjun rejected vijay devarakonda accepted

నోటా చిత్రంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించాడు కానీ అసలు ఈ సినిమా ఎవరు చేయాలో తెలుసా ? ఎందుకు వద్దన్నాడో తెలుసా ? …….. ఈ సినిమాలో హీరోగా నటించాల్సింది అల్లు అర్జున్. అవును అల్లు అర్జున్ దగ్గరకు నోటా కథ తీసుకొని వెళ్ళాడు దర్శకుడు ఆనంద్ శంకర్ , అయితే కథ విన్న తరువాత నా ఇమేజ్ కు ఈ కథ సరిపోదు , నచ్చలేదు అని నిర్మొహమాటంగా చెప్పాడట దాంతో చేసేదిలేక విజయ్ దేవరకొండ దగ్గరకు వెళ్లి ఈ కథ చెప్పాడట . రాజకీయ నేపథ్యంలో సాగే కథ కావడంతో బాగా నచ్చిందట ఇంకేముంది వెంటనే ఓకే చెప్పాడు కట్ చేస్తే అక్టోబర్ 5న విడుదల అవుతోంది.

గీత గోవిందం చిత్రం తర్వాత విజయ్ దేవరకొండ క్రేజ్ అనూహ్యంగా పెరిగిపోయింది. దాంతో నోటా చిత్రానికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. తెలుగు , తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 5న విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో విజయ్ దేవరకొండ ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నాడు.ముఖ్యమంత్రి పాత్రలో విజయ్ దేవరకొండ నటించగా జర్నలిస్ట్ గా హాట్ భామ మెహరీన్ నటించింది. ఒకవేళ నోటా పెద్ద హిట్ అయితే అల్లు అర్జున్ తప్పు చేసినట్లే ! అలాగే నోటా ప్లాప్ అయితే ఓ ప్లాప్ నుండి తప్పించుకున్నట్లే ! అయితే అల్లు అర్జున్ చేసింది తప్పా ? ఒప్పా ? అన్నది అక్టోబర్ 5 న తేలిపోనుంది.

English Title: Allu arjun rejected vijay devarakonda accepted