`మోస‌గాళ్లు` స్కామ్‌ని బ‌య‌ట‌పెట్టిన బ‌న్నీ

`మోస‌గాళ్లు` స్కామ్‌ని బ‌య‌ట‌పెట్టిన బ‌న్నీ
`మోస‌గాళ్లు` స్కామ్‌ని బ‌య‌ట‌పెట్టిన బ‌న్నీ

మంచు విష్ణు హిట్ కోసం విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. `ఢీ` వంటి సాలీడ్ హిట్ త‌రువాత ఆ రేంజ్ హిట్‌ని విష్ణు ఇప్ప‌టికీ ద‌క్కించుకోలేక‌పోయాడు. ఆ ప్ర‌య‌త్నంలో భాగంగా మంచు విష్ణు న‌టిస్తున్న తాజా చిత్రం `మోస‌గాళ్లు`. హాలీవుడ్ ద‌ర్శ‌కుడు జెఫ్రీ గీచిన్ ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నారు. కాజ‌ల్ అగ‌ర్వాల్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది.  24 ఫ్రేమ్స్ ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్‌పై హీరో మంచు విష్ణు న‌టిస్తూ నిర్మిస్తున్నారు.

ప్ర‌పంచాన్నే ఓ కుదుపు కుదిపేసిన ఐటీ స్కామ్ నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్ర ప్ర‌మోష‌న్ కు బ‌న్నీ ముందు కొచ్చారు. శ‌నివారం ఈ చిత్రానికి సంబంధించిన టీజ‌ర్‌ని స్టైలిష్ స్టార్ బ‌న్నీ రిలీజ్ చేశారు. `మోస‌గాళ్లు` స్కామ్‌ని బ‌య‌ట‌పెట్టే టీజ‌ర్‌ని రిలీజ్ చేసిన బ‌న్నీ టీమ్‌కి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఇటీవ‌ల ఈ చిత్రానికి సంబంధించిన థీమ్ మ్యూజిక్‌ని విక్ట‌రీ వెంక‌టేష్ విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే.

31 నిమిషాల పాటు సాగే ఈ టీజ‌ర్‌ ముందు స్కామ్‌కి పాల్ప‌డిన వారిని ఎట్టిప‌రిస్థితుల్లోనూ వ‌ద‌ల‌బోన‌ని ట్రంప్ హెచ్చ‌రిస్తున్న వీడియోతో మొద‌లైంది. ఆ త‌రువాత స్క్రాప్ బ్యాచ్ స్కామ్‌కి సంబంధించిన డ‌బ్బుని బ‌స్తాల్లో కూర్చి స్క్రాప్ ప్లేస్‌లో పెట్ట‌డం.. అక్క‌డికి మంచు విష్ణ‌, కాజ‌ల్ క‌లిసి వెళ్లి ఇది స‌రిపోతుందిగా అని కాజ‌ల్ అంటే ఆటి ఇప్పుడే మొద‌లైంద‌ని విష్ణు చెబుతున్న డైలాగ్స్ సినిమా ఏంట‌నేది స్ప‌ష్టం చేస్తోంది. అయితే మేకింగ్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ పై మ‌రింత శ్ర‌ద్ధ తీసుకుని వుంటే బాగుండేది. ఇందులో మంచు విష్ణుకి కాజ‌ల్ అగ‌ర్వాల్ చెల్లెలు‌గా న‌టిస్తోంది. సునీల్‌శెట్టి, రుహీసింగ్‌, ప‌వ‌దీప్‌ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు.