బన్నీకి సరైన సమయంలో ఈ రేంజ్ హిట్ పడిందా?బన్నీకి సరైన సమయంలో ఈ రేంజ్ హిట్ పడిందా?
బన్నీకి సరైన సమయంలో ఈ రేంజ్ హిట్ పడిందా?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ టాప్ హీరోల లిస్ట్ లో మార్కెట్ పరంగా కొంత వెనుకపడ్డాడనే చెప్పాలి. ఎందుకంటే బన్నీ కెరీర్ లో సక్సెస్ శాతం మిగతా హీరోలతో పోల్చుకుంటే ఎక్కువే కానీ భారీ రేంజ్ హిట్లు చాలా తక్కువ. బన్నీ కంటే తర్వాత వచ్చిన రామ్ చరణ్ తన రెండో సినిమాతోనే ఇండస్ట్రీ హిట్ ను అందుకున్నాడు. సరైనోడుకి ముందు వరకూ కూడా బన్నీ మార్కెట్ 40 కోట్లకు అటూ ఇటూగా ఉండేది. అయితే సరైనోడుతో మొదటి సారి 60 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టాడు అల్లు అర్జున్. అయితే ఆ తర్వాత చేసిన డీజే, నా పేరు సూర్య సినిమాలతో మళ్ళీ రేసులో వెనుకపడ్డాడు. ఈ రెండు ఫలితాలు ఊహించని అల్లు అబ్బాయి ఏకంగా ఏడాదికి పైగా గ్యాప్ తీసుకున్నాడు. తనకు ఎలాంటి సినిమాలు సూట్ అవుతాయోనని అనలైజ్ చేసుకున్నాడు. తనకేం కావాలో తెలుసుకుని దాని ప్రకారంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కూర్చుని కథ గురించి మంతనాలు జరిపాడు.

అల వైకుంఠపురములో సినిమాకు సంబంధించి చాలా విషయాల్లో బన్నీ ప్రమేయం ఉంది. అసలు సినిమాకు లిరికల్ వీడియోలు రొటీన్ అయిపోతున్నాయి వాటికి బదులుగా మ్యూజిక్ వీడియోస్ చేద్దామని సలహా ఇచ్చింది బన్నీనే. దాని ఇంపాక్ట్ ఎలా ఉందో ఇప్పుడు అందరం చూస్తున్నాం. అలాగే ఈ సినిమాలో తన స్టైల్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. తన లుక్ ఎలా ఉండాలో కూడా క్లారిటీగా ఉన్నాడు బన్నీ. స్ట్రాటజిక్ గా గీతా ఆర్ట్స్ ను ఈ సినిమాలో భాగస్వామిని చేసాడు. దాని వల్ల ప్లానింగ్ కు మారుపేరైన గీతా ఆర్ట్స్ వల్ల అంతా సజావుగా జరిగింది. మొత్తానికి కారణాలు ఏవైనా బన్నీ మాములు హిట్ కొట్టలేదు. నాన్ బాహుబలి రికార్డులను కొల్లగొట్టే హిట్ కొట్టి తన స్థానాన్ని మెరుగుపరుచుకున్నాడు.

ఇప్పుడు సుకుమార్ తో చేయబోయే సినిమాకు ఫుల్ ఫ్రీడమ్ ఉండాలి. అల వైకుంఠపురములో ఫలితం తేడా కొట్టి ఉంటే సుకుమార్ సినిమాకు ఒత్తిడి ఎక్కువ ఉండేది. కానీ ఇప్పుడు ఫ్రీ మైండ్ తో ముందుకు వెళ్లిపోవచ్చు. సుకుమార్ కు క్రియేటివ్ ఫ్రీడమ్ ఇస్తే ఒక రంగస్థలం ఇచ్చాడు. మరి ఈసారి ఏం చేస్తాడో చూడాలి.