య‌స్.. మా కుటుంబానిది బంధుప్రీతే!


Allu Arjun sensational comment on nepotism
Allu Arjun sensational comment on nepotism

ఇండ‌స్ట్రీని కొన్ని కుటుంబాలు మాత్ర‌మే ఏలుతున్నాయి. ఇంట‌స్డ్రీలోకి వేరే ఎవ‌రినీ రానీయ‌కుండా తొక్కేస్తున్నార‌ని గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా వింటూనే వున్నాం. ఆ మాట‌లు నిజ‌మే అని తేల్చేశారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌. ఆయ‌న క‌థానాయ‌కుడిగా న‌టించిన తాజా చిత్రం `అల వైకుంఠ‌పుర‌ములో`. త్రివిక్ర‌మ్ తెర‌కెక్కించారు. గీతా ఆర్ట్స్‌, హారిక హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్స్‌పై అల్లు అర‌వింద్‌, ఎస్‌. రాధాకృష్ణ నిర్మించిన ఈ చిత్రం ఈ ఆదివారం వ‌ర‌ల్డ్ వైడ్‌గా విడుద‌లై అనూహ్య విజ‌యాన్ని సాధిస్తోంది.

వ‌సూళ్ల పరంగానూ రికార్డులు సృష్టిస్తోంది. ఈ సంద‌ర్భంగా సోమ‌వారం నెపోటిజ‌మ్ ( బంధుప్రీతి)పై అల్లు అర్జున్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ మ‌ధ్య ఓ ఇంట‌ర్వ్యూలో నెపోటిజ‌మ్ పై నా అభిప్రాయం అడిగారు.  దేవుడికి ఒక పూజారి కుటుంబం త‌ర‌త‌రాలుగా త‌మ జీవితాన్ని అంకితం చేస్తోంది. తండ్రి త‌రువాత కొడుకు.. కొడుకు త‌రువాత మ‌న‌వ‌డు త‌న జీవితాన్నిదేవుడికి అంకితం చేశారు. అలాగే మా కుటుంబం కూడా సినిమాకి మా జీవితాల్ని అంకితం చేసింది` అన్నారు.

మా కుటుంబంలో మాతాత చేశాడు, ఆ త‌రువాత మానాన్న చేశారు. ఇప్పుడు నేను చేస్తున్నా. దీన్ని నెపోటిజం అనుకుంటే య‌స్ ఇది నెపోటిజ‌మే అనుకోండి. మేం ప్ర‌జ‌ల కోసం త‌ర‌త‌రాలుగా ప్ర‌జ‌ల‌కు వినోదాన్ని పంచ‌డానికి వాళ్ల‌కు స‌రెండ‌ర్ అయ్యాం` అని త‌న‌ని నెపోటిజ‌మ్ గ‌రించిప్ర‌శ్నించిన వారికి క్లారిటీ ఇచ్చారు.