భార్య కోసం పాటందుకున్న స్టార్ హీరో!


Allu Arjun sing a song for his wife
Allu Arjun sing a song for his wife

ఈ సంక్రాంతికి బ్లాక్ బ‌స్ట‌ర్‌ని సొంతం చేసుకున్నారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో బ‌న్నీ న‌టించిన చిత్రం `అల వైకుంఠ‌పుర‌ములో`. ఈ నెల 12న విడుద‌లైన ఈ చిత్రం వ‌ర‌ల్డ్ వైడ్‌గా బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డులు సృష్టిస్తూ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. దీంతో సంబ‌రాల్లో మునిగితేలుతున్నారు అల్లు అర్జున్‌.

బుధ‌వారం రాత్రి అల్లు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ క‌లిసి సంక్రాంతి ఫెస్టివ‌ల్‌ని గ్రాండ్‌గా జ‌రుపుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆర్కేస్ట్రా కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఇందులో ఓ గాయ‌కుడు `అల వైకుంఠ‌పుర‌ములో`ని రాములో.. రాములా.., సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న‌.. పాట‌ల్ని ఆల‌పించి అల‌రించారు. `సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న‌.. పాట పాడుతున్న సంద‌ర్భంలో హీరో బ‌న్నీ కూడా ఆ గాయ‌కుడితో క‌లిసి గొంతు క‌లిపారు. ఇదంతా చూస్తూ బ‌న్నీ వైఫ్ స్నేహారెడ్డి సిగ్గుల మొగ్గ‌య్యారు. దీనికి సంబంధించిన ఓ వీడియోని అల్లు శిరీష్ సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్‌లో షేర్ చేశారు.

ఈ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఇదే కార్య‌క్రంలో బ‌న్నీ `రాములో రాములా.. పాట‌కి నిహారిక‌తో క‌లిసి స్టెప్స్ వేయ‌డం విశేషం. ఈ వీడియోని చిరు చిన్న‌ల్లుడు క‌ల్యాణ్‌దేవ్ ట్విట్ట‌ర్‌లో షేర్ చేశారు.

 

View this post on Instagram

 

This made my Sankranthi!!! My two favorites to my fav song this season. @alluarjunonline @allusnehareddy @musicthaman

A post shared by Allu Sirish (@allusirish) on