అర్జున్ రెడ్డి చూసాక అల్లు అర్జున్ కు నిద్ర పట్టలేదట


allu arjun sleepless nights with arjun reddy

అర్జున్ రెడ్డి చిత్రాన్ని చూసిన తర్వాత నాకు వారం రోజులు నిద్ర పట్టలేదని సంచలన వ్యాఖ్యలు చేసాడు అల్లు అర్జున్ . మనం చేస్తున్న సినిమాలు ఏంటి ? అర్జున్ రెడ్డి లాంటి చిత్రాలను చేయలేమా ? అని మదన పడ్డాడట అల్లు అర్జున్ ఈ విషయాన్నీ ఈ హీరో నే స్వయంగా చెప్పడం విశేషం . నిన్న సాయంత్రం ”గీత గోవిందం ” ఆడియో వేడుక జరుగగా ఆ వేడుకకు అల్లు అర్జున్ ముఖ్య అథితిగా హాజరయ్యాడు . గీత గోవిందం చిత్రాన్ని చూశానని , సినిమా చాలా బాగుందని విజయ్ దేవరకొండ -రష్మిక మండన్నా నటన అద్భుతమని కొనియాడాడు అల్లు అర్జున్ . అయితే తన కొత్త సినిమా ఇప్పట్లో లేదని , దాని గురించి నేను చెప్పేవరకు ఎవరూ అడగొద్దని అభిమానులను కోరాడు అల్లు అర్జున్ .

విజయ్ దేవరకొండ – రష్మిక మండన్నా జంటగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన గీత గోవిందం చిత్రాన్ని నిర్మించింది అల్లు అర్జున్ స్నేహితుడు బన్నీ వాసు దాంతో ఈ వేడుకకు ముఖ్య అథితి గా వచ్చాడు . న పేరు సూర్య నా ఇల్లు ఇండియా ఘోర పరాజయం పొందడంతో ఈసినిమా చేయాలో తెలీక ఇబ్బంది పడుతున్నాడు అల్లు అర్జున్ . అందుకే కొంత గ్యాప్ తీసుకుంటున్నాడు . త్వరలోనే ఏ సినిమా చేయబోయేది ప్రకటిస్తాడట ఈ హీరో .

English Title: allu arjun sleepless nights with arjun reddy